చంద్రబాబుకు సీఎస్ ఓ రేంజ్ లో షాక్ లు మీద షాక్ లు ఇస్తున్నాడు. మొదటి నుంచి సీఎస్ ను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నాడు. ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో బాబు విమర్శల పాలయ్యారు.  ఆ తర్వాత కూడా ఈ సీఎస్ తో చంద్రబాబు నాయుడు ఇబ్బందులు తప్పడంలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా తనే ముఖ్యమంత్రిని అంటూ చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహించడంపై సీఎస్ స్పందించిన తీరు మరింత చర్చనీయాంశం అయ్యింది.


బాబు సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ నోటీసులు జారీచేశారు. దీంతో మళ్లీ బాబు 'సమీక్ష' అనే ఊసు ఎత్తడంలేదు. ఇక తను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, తనకు అధికారాలు లేవనే విషయాన్ని బయటకు చెప్పుకుని చంద్రబాబు వాపోతూ ఉన్నారు. అదంతా చట్ట ప్రకారమే అయినా, బాబు అదేదో మహాపరాధం అయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక 'జూన్ ఎనిమిది' అంటూ తెలుగుదేశం వాళ్లు చేస్తున్న హడావుడి మీద కూడా సీఎస్ ఘాటుగానే స్పందించారు.


'తెలుగుదేశం పార్టీ గెలిస్తే వాళ్లు ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు.. వైఎస్సార్సీపీ గెలిస్తే మే ఇరవై మూడునే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాల్సి ఉంటుంది. మే ఇరవై నాలుగు నుంచి ఎప్పుడైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు..’ అని సీఎస్ ఎల్వీ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'ఫలితాలు ఎలా ఉన్నా.. జూన్ ఎనిమిది వరకూ తమదే అధికారం..' అంటూ తెలుగుదేశం చేస్తున్న  సిల్లీ వాదనకు సీఎస్ అలా చెక్ పెట్టారు. ఇక చంద్రబాబు నాయుడు అపద్ధర్మ ముఖ్యమంత్రి కాదంటూనే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయన అధికారాలు పరిమితం అని సీఎస్ మరోసారి స్పష్టంచేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: