చంద్రబాబునాయుడు అనాలోచితంగా చేస్తున్న కొన్ని పనులు ఆయన స్ధాయిని దిగజార్చేస్తున్నాయి. తాజాగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం వైఖరితో చంద్రబాబు స్ధాయి మరింతంగా దిగజారిపోయింది. ఈనెల 10వ తేదీన క్యాబినెట్ నిర్వహించాలని చంద్రబాబు అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యంగా సమావేశానికి ఏర్పాట్లు చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు.

 

ఇక్కడే చంద్రబాబు చవకబారు ఆలోచనలు బయటపడ్డాయి. ఎందుకంటే, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా క్యాబినెట్ సమావేశం పెట్టకూడదు. ఏ విషయంపైన కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టే క్యాబినెట్ సమావేశం వద్దంటారు. కానీ చంద్రబాబు పంతం కొద్ది క్యాబినెట్ ఏర్పాటు చేయమన్నారు.

 

అయితే సిఎం నుండి సిఎస్ కు వచ్చిన నోట్ లో ఏ అంశాలపై చర్చించాలని అనుకుంటున్నారో సదరు అజెండాను పంపలేదు. దాంతో అసలు క్యాబినెట్ ఎందుకు జరిపించాలని అనుకుంటున్నారు ? అజెండా ఏమిటి ? చెప్పమంటూ సిఎస్ చంద్రబాబును వివరణ కోరారు. చంద్రబాబు నుండి వచ్చిన రిప్లైని ఎలక్షన్ కమీషన్ కు పంపి అనుమతి వస్తే క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామని ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టంచేశారు. మరిపుడు చంద్రబాబు ఏం సమాధానం ఇస్తారో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: