
జగన్ అధికారానికి వస్తాడన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే అనేక రకాలైన సర్వేలు జగన్ దే అధికారం అని చెప్పుకొచ్చాయి. ఐతే ఇపుడు ఏపీలో జగన్ ది పవర్ అంటూ మరో మాట గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో టీడీపీకి ఈసారికి ప్రతిపక్షమేనని కూడా చెప్పేస్తున్నారు.
కేంద్రంలో అధికారం కలిగిన బీజేపీ తనకున్న సోర్సు తో, ఇంటెలిజెన్స్ సర్వేల ఆధారంగా ఏపీలో జగన్ దే అధికారం అని నిర్దారించింది ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు జగన్ కి ఏపీలో 110 సీట్లు వస్తాయని తేల్చేశారు. దాంతో జగన్ సీఎం అవడమే ఖాయమని కూడా ఆయన పక్కాగా చెప్పేశారు. ఇక మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన జోస్యం చెప్పారు.
బీజేపీ జాతీయ పార్టీ అని ఒక చోట సీట్లు తగ్గితే దాన్ని మరో చోట భర్తీ చేసుకుంటుందని ఆయన ధీమాగా చెప్పారు. రెండు తెలుగు రాష్టాలో సీట్ల లోటుని తమిళనాడుతో పూడ్చుకుంటామని మురళీధరరావు అన్నారు. తెలంగాణాలో టీయారెస్ కి అసలైన ప్రత్యామ్నాయం బీజేపీ అని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద బీజేపీలోనూ ఇపుడు జగన్ మాట బాగానే వినిపిస్తోందన్న మాట.
కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను అభ్యంతరకరమైనవిగా గుర్తించండి వాటిని తీసివేసేందుకు మాకు సహకరించండి- ఇండియాహెరాల్డ్ గ్రూప్