పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతున్న తీరుపై సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణం లోపభూయిష్టంగా జరుగుతోందని..ఏదైనా తేడా వస్తే.. రాజమండ్రి సహా వందల ఊళ్లు మునిగి అపార ప్రాణనష్టం జరుగుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్‌ విషయంలో ప్రభుత్వం వెళుతున్న దారి సరికాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.


పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడుతున్నా చంద్రబాబు సర్కారు లైట్ గా తీసుకుంటోందని ఆయన విమర్శించారు.  ప్రమాదకర పరిస్ధితిలో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని... భవిష్యత్తులో తేడా వచ్చి డ్యాం డామేజ్ అయితే రాజమండ్రి కొట్టుకుపోతోందని ఉండవల్లి హెచ్చరించారు. ఈ విషయంపై నిపుణులైన జియాలజిస్టులను పిలిపించి పరిశీలన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

పోలవరం నిర్మాణంలో టీడీపీ అనుసరిస్తున్న తీరు పూర్తిగా రాజకీయ కోణమేనని ఉండవల్లి అన్నారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులే స్వయంగా తనకు చెబుతున్నారని ఉండవల్లి ఆరోపించారు. ఓవైపు పట్టి సీమ, మరోవైపు పురుషోత్తపట్నం ఉండగా మళ్లీ కాపర్ డామ్ ద్వారా నీళ్లిస్తానని చంద్రబాబు చెప్పడం ఎందుకుని నిలదీశారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూలంకషంగా అన్నీ పరిశీలించి న్యాయబద్దంగా బిల్లులు విడుదల చేస్తుండం టీడీపీ అనుకూల కాంట్రాక్టర్లకు నచ్చడం లేదని ఉండవల్లి అన్నారు. అందుకే ఆయనపై ఆరోపణలు చేస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. ఇటీవల కేంద్రం ప్రతినిధులు వచ్చినప్పుడు పునరావసం నిధుల గురించి నిలదీయకుండా రాష్ట్రం సర్దుపాటు చేసుకుంటుందన్న రీతిలో మాట్లాడటడం సరికాదని ఉండవల్లి అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: