చంద్రబాబు రాజకీయ గండర గండడు. ఆయన తాను చెయాల్సిన పనిని ఎదుటి వారి చేత చేయిస్తారు. కొన్ని సార్లు తాను చేసుకుపోతూ అవతల వారు కనీసం ఏమీ అనలేని స్థితికి తీసుకువస్తారు. ఓ విధంగా మైండ్ గేమ్  ఆడడంలో బాబుకు బాబే సాటి. నాకు నలభయ్యెళ్ళ అనుభవం ఉందని, దేశంలో ప్రజాస్వామ్యం బతకాలని  ప్రతీ రోజూ నీతులు చెప్పే చంద్రబాబు వ్యవస్థనలు తనకు నచ్చకపోతే ఎంతకైనా విమర్శించేస్తారు.


దానికి ఎన్నో ఉదాహరణలు ఈ మధ్యనే కళ్ళ ముందు కనిపిస్తాయి. ఏపీలో ఎన్నికలను ఎన్నికల సంఘం నడిపించిన తీరు చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డబాయింపునకు లొంగి పోయిందనే అర్ధమవుతోంది. చంద్రబాబు అడ్డగోలుగా ఈసీ నిబంధలనను తోసేసి ముందుకుపోతే ఏమీ చేయలేక ఈసీ చేష్టలుడిగి చూస్తోంది. నిన్న గాక మొన్న రీపోలింగ్ జరిగితే అదే రోజు చంద్రబాబు పోలవరం టూర్ పెట్టుకున్నారు. అక్కడ ఆయన అన్న మాటలు ఎంతో కొంత ప్రభావం ఓటర్ల మీద చూపిస్తాయి. మరి ఈ సంగతి తెలిసి ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందో చెప్పాలి.


ఇక చంద్రబాబు తుపాన్ సమీక్ష పేరు చెప్పి ఉండవల్లి ప్రజావేదిక మీద మీడియా మీట్ పెట్టారు. అక్కడ ఆయన  చేసిన కామెంట్స్ అన్ని రాజకీయపరమైనవే. ఇక ప్రుభుత్వ ప్రధాన కార్యదర్శిని. ఈసీని ఘాటుగా  విమర్శలు చేసిన ఈసీ ఎందుకో మౌనంగానే ఉండిపోయింది. దాంతో అక్కడే బాబు విజయం సాధించారనుకోవాలి. ఇక దేశంలో ఎన్నో రాష్టాలు ఈసీ నిబంధలనకు లోబడి ముందు ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ఆపేశాయి. కానీ ఎన్నికల వేళ పసుపు కుంకుమ కింద చెక్కులు ఇవ్వడం, పించన్లు, రైతులకు పెట్టుబడి సాయం ఇవన్నీ ఎన్నికల ముందు రోజు వరకూ పంపిణీ చేసినా ఈసీ ఏమీ చేయలేక ఉండిపోయింది. ఓ విధంగా ఇవన్నీ ప్రలోభాల కిందకే వస్తాయి.


ఎన్నికల వేళ చూసుకున్నా ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలను పోలింగ్ స్టేషన్లో ఉంచి వారికి ఎటువంటి సాంకేతిక  అవగాహన లేకపోవడం వల్లనే ఈవీఎం లు మొరాయించాయని తెలిసినా ఈసీ బాబు ప్రభుత్వాన్ని తప్పు పట్టలేకపోయింది. అంతేనా నా ఓటు ఎవరికి వేశానో తెలియదు అంటూ బాబు మాట్లాడిన మాటలు, ముప్పయి శాతం ఈవీఎంలు పనిచేయడంలేదంటూ చెప్పిన అబద్దం మాటలు, టీడీపీనే గెలిపించాలంటూ బాబు పోలింగ్ వేళ ఇచ్చిన పిలుపు ఇవన్నీ కూడా ఈసీ వదిలేసిందంటే బాబు ట్రాప్ లో బాగా  పడిపోయిందనుకోవాలా లేక ఏమీ చేయలేక మిన్నకుండిపోయిందనుకోవాలో అర్ధం కాని పరిస్థితి.


మొత్తానికి చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు బాగా నిర్వహించిన ఈసీ అర్ధరాత్రి వరకూ పోలింగ్ నకు కు అవకాశం ఇచ్చి అందరికీ న్యాయం చేసిన ఈసీ బాబు విమర్శల వల్ల జనంలో చెడ్డ పేరు తెచ్చుకుంది. మరి ఈ విధంగా అబద్దాలు ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తూ నిందారోపణలు చేసిన బాబు మీద ఒక్క కేసు కూడా ఈసీ నమోదు చేయకపోవడాన్ని ఏమనుకోవాలి. ఓ విధంగా ఈసీ బాబు డబాయింపులకు లొంగిపోయిందనుకోవాలంటున్నారు. ఓ విధంగా మొండివాడే రాజు అన్నట్లుగా ఉంది పరిస్థితి.  అలాంటపుడు వ్యవస్థలను మనం ఎందుకు పెట్టుకోవాలి అన్న ప్రశ్న ఇక్కడ వస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: