మొన్నటి ఎన్నికల్లో పోలింగ్ సరళి ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంటే. అలాంటి నేపధ్యంలో వైసిపిని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబునాయుడు భారీ స్కెచ్ వేశారు. పోయిన ఎన్నికల్లో మంగళగిరిలో వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గెలిచింది కేవలం 12 ఓట్ల మెజారిటీతోనే. ఆ మెజారిటీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిందే. పోస్టల్ బ్యాలెట్ల సంగతి పక్కనపెట్టినా పోయిన ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్ధులు వందల మెజిరీటీ గెలిచిన నియోజకవర్గాలు పదుల సంఖ్యలో ఉన్నాయి.

 

పోస్టల్ బ్యాలెట్ ను మ్యానేజ్ చేసుకోవటం ద్వారా ఈజీగా గెలవచ్చని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న 4, 48, 443 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. లెక్క ప్రకారం వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సిందే. కానీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందిన ఉద్యోగులు 3, 64, 249 మాత్రమే. అంటే 84,194 మందికి పోస్టల్ బ్యాలెట్ అందలేదు.

 

మామూలుగా అయితే ఉద్యోగుల్లో అత్యధికులు చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. వాళ్ళందరూ తమకు వ్యతిరేకంగా ఓట్లేస్తారని ముందుగానే చంద్రబాబు గ్రహించారు. అందుకనే ఎన్నికల విధులు అనే పేరు చెప్పి కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే నిర్వర్తించాల్సిన ఎన్నికల విధుల్లోకి వేలమంది ప్రైవేటు ఉద్యోగులను కూడా చేర్పించేశారు.

 

అంటే టిడిపి నేతల నడుపుతున్న విద్యాసంస్ధల్లోని ఉద్యోగులన్నమాట. ఆ విషయం చివరినిముషంలో బయటపడినా అప్పటికే చాలామంది ఓట్లేసేశారు. కాబట్టి చేయగలిగేదేమీలేదు. అలాగే టిడిపికి ఓట్లేయరు అన్న అనుమానం ఉన్న సుమారు 84 వేలమంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు అందకుండా చేశారు. దాంతో ఆ విషయంలోనే ఇపుడు వివాదం ముదురుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా చిత్తూరులో 17,392 ఉంటే శ్రీకాకుళంలో అతితక్కువగా 576 ఉన్నాయి.

 

పోస్టల్ బ్యాలెట్లు అందని ఉద్యోగులు ప్రతీ జిల్లాలోను సగటున 6476 మందున్నారు. ప్రతీ ఓటూ చాలా విలువైనదే అని అనుకుంటున్న సమయంలో 6476 ఓట్లంటే మామూలు విషయం కాదు.  అదే విధంగా పోస్టల్ బ్యాలెట్లు అందని ఓటర్లను 175 నియోజకవర్గాలకు చూస్తే  సగటు 481గా ఉంది. వీరందిరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇస్తే ఎవరికి ఓట్లు పడతాయో తెలీదు. తమకు పడవని టిడిపి అంచనా వేసుకుంది కాబట్టే వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందకుండా చేసింది. మరి ఈ మేరకు వైసిపికి ఎంతో నష్టమో అర్ధమవుతోంది కదా ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: