చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా తన హుందా తనాన్ని కాపాడుకోలేకపోతున్నారు. అధికారులతో ఘర్షణ వాతావరణం బాబుకే చేటు చేసేటట్లుంది. అయితే వ్యవస్థ కన్నా తనే ఎక్కువ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహించ ప్రయత్నించారు. అంతేగాక కేబినెట్ సమావేశం అంటూ మళ్లీ హల్చల్ చేశారు చంద్రబాబు. కట్ చేస్తే ఇప్పుడు కేబినెట్ భేటీ జరగడం లేదు. 'పదోతేదీన కేబినెట్ భేటీకి, అధికారులు ఎలా రారో చూస్తా..' అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడిన చంద్రబాబు నాయుడు చివరకు ఆ భేటీని అయితే నిర్వహించలేకపోతూ ఉన్నారు.


ఎందుకు అంటే.. పాత లాజిక్కే. బెదిరింపు ధోరణితో అధికారులు కేబినెట్ భేటీకి రావాల్సిందేనన్న చంద్రబాబుకు వారు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని గుర్తుచేశారు. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి కావాలని స్పష్టం చేశారు. దీంతో కేబినెట్ భేటీ రద్దు అయ్యింది. అయితే రద్దు కాదు వాయిదా.. ఈసీ అనుమతి వచ్చాకా కేబినెట్ భేటీ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తెలుగుదేశం వాళ్లు.


మరి ఈ మాత్రం దానికి అధికారులను బెదిరించింది ఎందుకు? తను సమావేశం నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించి, 'ఎలా రారో చూస్తా..' అని ప్రగల్బం పలికి.. తీరా ఇప్పుడు వెనక్కు తగ్గడం అంటే ఇది చంద్రబాబుకు అవమానం కాదా? కొండంత రాగం తీసి.. ఇప్పుడు కేబినెట్ భేటీ లేకుండా పోవడం అంటే.. ఫార్టీ ఇయర్స్ సీనియర్ పరిస్థితి ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: