వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఎక్క‌డ ఎలా ఉండాలో? ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించాలో చాలా బాగా తెలుసున‌ని అంటారు. ఇప్పు డు ఏపీలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది? అస‌లు అత్యంత సీనియ‌ర్ అయిన సీఎం చంద్ర‌బాబు ఎందుకు ఘ‌ర్ష‌ణ‌కు దిగుతున్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అటు కేంద్ర ఎన్నిక‌ల సం ఘంపై వివాదాల‌కు దిగ‌డం, త‌ను వేసిన ఓటు త‌న పార్టీకే ప‌డిందా? అనే సందేహం వ్య‌క్తం చేయ‌డం వంటి ప‌రిణామాలు రాజ‌కీయంగానే కాకుండా మేదావుల‌ను సైతం విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ఏం చేస్తే.. తాను కూడా అదే చేస్తాన‌ని అన‌డం బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించేలా చేస్తోంది. 


ఈ నేప‌థ్యంలో ఇప్పుడు చంద్ర‌బాబు ప్లేస్‌లో జ‌గ‌న్ ఉండి ఉంటే.. ప‌రిస్థితి ఎలా ఉండేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. ఎక్క‌డ ఎవ‌రిపై ఎలా దాడి చేయాలో.. ఏ అవ‌కాశాన్ని అనుకూలంగా మార్చుకోవాలో.. ఆయ‌న‌కు బాగానే తెలుసున‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యా ప్తంగా కూడా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టికీ.. కోడ్ అమ‌ల‌వుతోంది. అయినా కూడా చంద్ర‌బాబు త‌న‌దే పైచేయి అని అంటున్నారు ఇదే జ‌గ‌న్ ఉండి ఉంటే.. క‌నీసం అధికారుల మాట ప‌క్క‌న పెట్టి.. కోడ్‌కైనా విలువ ఇచ్చేవార‌ని చెబుతున్నారు. 


అంతేకాదు, నిజానికి కోడ్ ఉన్న స‌మ‌యంలో ఎలాంటి కీల‌క నిర్న‌యాలు కూడా తీసుకునే వెసులుబాటు ఉండ‌దు. ఈ విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అదే స‌మ‌యంలో మంత్ర వ‌ర్గ స‌మావేశాల‌కు కూడా ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌త్య‌క్షంగా చూసి కూడాదానిపై జ‌గ‌న్ ఎక్క‌డా నింద లు వేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా వీవీప్యాట్ స్లిప్పుల్లో తాను ఎవ‌రికి ఓటేసింది కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ప్పుడు కూడా విమ‌ర్శ‌లు చేయ‌డం అంటే.. ఏమ‌నాల‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఇదే జ‌గ‌న్ అయి ఉంటే.. ప‌రిస్థితి వేరేలా ఉండేదని చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న విష‌యాల‌పై జ‌గ‌న్ ఎప్పుడూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ని, అధికారులతో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ కోరుకుంటున్నార‌ని చెబుతున్నారు. సో.. మొత్తానికి బాబుకు, జ‌గ‌న్‌కు ఇంత తేడా ఉంద‌ని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: