లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ఐకాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ల్యాంకో పేరుతో కంపెనీలు పెట్టినవాడు.. పారిశ్రామికవేత్తగా పేరు పొందినవాడు.. కానీ అలాంటి పేరుగొప్ప లగడపాటికి చెందిన ఓ కంపెనీ దివాలా తీసేసింది. 


రాజగోపాల్ అనేక ల్యాంకో సంస్థలు ప్రారంభించారు. వాటి కోసం బ్యాంకుల వద్ద కోట్ల రూపాయలు అప్పలు తీసుకున్నారు. అవి సరిగ్గా కట్టక దివాలాకు దరఖాస్తు పెడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. తాజాగా ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ దివాలా తీసింది. 

ఈ ల్యాంకో సంస్థ మొదట 740 కోట్లు.. రెండో విడత 1180 కోట్లు బ్యాంకుల దగ్గర అప్ప తీసుకుందట. 2018 అగస్ట్ నాటికి మొత్తం  657 కోట్ల రూపాయలు బకాయిపడింది. ఇక ఈ అప్పులు తీర్చే పరిస్థితిలో లేమని దివాలా ప్రాసెస్ కు దరఖాస్తు చేసుకుందట. 

ఎలాంటి పనులు చేయకుండా వందల కోట్ల రూపాయల బ్యాంకుల సొమ్ములను లగడపాటి అండ్ కో జల్సాలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి మొండి బకాయిల బ్యాంకుల వద్ద కోట్లలో పేరుకుపోయాయి. అవన్నీ జనం నెత్తి మళ్లీ ఫీజులు రూపంలో బాదడమే బ్యాంకులకు తెలిసిన ప్రక్రియ అని సామాన్యుడు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: