ఏసీబీ అధికారుల చేతికి భారీ అవినీతి తిమిగ‌ళాలు, అవినీతి చేప‌లు చిక్కుతున్నాయి. త‌డ‌ప‌నిదే ప‌ని చేయ‌డ‌ని అధికారుల భ‌ర‌తం ప‌డుత‌న్నారు ఏసీబీ అధికారులు. తాజాగా మ‌రో అవినీతి అధికారి చిక్కాడు. ఆధాయానికి మించి ఆస్తున్నాయ‌న్న స‌మాచారంతో క‌డ‌ప వాణిజ్య ప‌న్నుల శాఖ డిప్యూటీ క‌మిష‌న‌ర్ లూర్ద‌య్య నాయ‌డు ఇళ్ల‌ల్లో సోదాలు జ‌రిపారు ఏసీబీ అధికారులు.


ఈ దాడుల్లో భారీగా బంగారం, న‌గ‌దును ప‌ట్టుకున్నారు. క‌డ‌ప బాలాజీ న‌గ‌ర్‌లో ఉన్న కీర్తి ఎన్‌క్లేవ్ అపార్ట్ మెంట్‌లో ఉంటున్న లూర్ద‌య్య‌నాయుడు ఫ్లాట్లో సోదాలు చేశారు. క‌డ‌ప‌తో పాటు విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. కీల‌క డాక్యూమెంట్ల స్వాధీనం చేసుకున్నారు. 


క‌డ‌ప‌లో నిర్వ‌హించిన త‌నిఖీల్లో.. డిప్యూటీ క‌మిష‌న‌ర్ లూర్ద‌య్య‌కు.. క‌ర్నూలులో రెండు ఫ్లాట్లు.. చాగ‌ల‌మ‌ర్రి ప్రాంతంలో వారి కుమార్తెల పేర్ల మీద 15 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉన్న‌ట్లు గుర్తించారు. 4 ల‌క్ష‌ల 50 వేల న‌గ‌దు, 750 గ్రాముల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో డిప్యూటీ క‌మిష‌న‌ర్ లూర్ద‌య్య‌నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: