గెలుపుపై ఫుల్ కాన్ ఫిడెన్స్ గా ఉన్న వైసీపీ అధినేత చాలా కూల్ గా ఉన్నారు. గత నెల రోజుల్లో ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఆయన మౌనంగానే గమనిస్తున్నారు. ఇంతటి ఖాళీ సమయం వేరేగా దొరకదు కాబట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వచ్చిన జగన్ ఇపుడు మెల్లగా పొలిటికల్ మూడ్ లోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. జగన్ యాక్టివ్ అవుతున్నారని టాక్.


జగన్ హైదరాబాద్ వీడి తాను కొత్తగా కట్టించుకున్న అమరావతిలోని తాడేపల్లి ఇంటికి చేరుకుంటారని చెబుతున్నారు. బహుశా అది ఈనెల మూడవ వారంలో ఉంటుందని చెబుతున్నారు. జగన్ ఈ నెల 16న నాటికి కొత్త ఇంటికి చేరుకోవడమే కాదు, మొత్తం పార్టీని గేర‌ప్ చేస్తారని తెలుస్తోంది. కొత్త ఇంటికి వచ్చిన వెంటనే పార్టీ నాయకులతో కౌంటింగ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిపై మీటింగ్ పెడతారని అంటున్నారు. ఈ మేరకు కౌంటింగ్ ఏజెంట్లతో జగన్ సమావేశమవుతారని కూడా తెలుస్తోంది.


ఇక ఎన్నికల కంటే ముందే జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా కూడా తన ఎన్నికల ఎత్తులు వ్యూహాలు టీడీపీ పసిగడుతోందన్న జాగ్రత్తతో అక్కడ నుంచి మకాం మార్చేసి  హైదరాబాద్ లోటస్ పాండ్ వెళ్ళిపోయారు. ఇపుడు ఎటూ ఎన్నికలు అయిపోయాయి. రిజల్ట్స్ వస్తే తామే అధికారం చేపడతామని ధీమాగా ఉన్న జగన్ ఎన్నికల ఫలితాలను తన కొత్త ఇంటి నుంచే వింటారని తెలుస్తోంది. అంటే సీఎం గా ఆ ఇంటి నుంచే జగన్ తన కార్యకలాపాలు మొదలెడతారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: