మే 23న ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఎన్నికల సంఘం ఆ ఏర్పాట్లను ప్రారంభించింది. కలెక్టర్లను సమయాత్తం చేస్తోంది. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించాలని సూచించింది. కౌంటింగ్ సిబ్బందికి అవ‌గాహ‌న‌కు ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 


కౌంటింగ్ కోసం సిబ్బందిని రెండు ద‌శ‌ల్లో రాండ‌మైజేష‌న్ ద్వారా ఎంపిక‌ చేస్తారు. ఒక్కొక్క అసెంబ్లీ ఒట్ల లెక్కింపుకు 180 మంది వ‌ర‌కు సిబ్బంది అవ‌స‌రం అవుతారని సీఈసీ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు  25 వేల మంది సిబ్బంది అవ‌స‌రమని అంచనా చేస్తున్నారు.

మే 23 కౌంటింగ్ రోజే ఏ ఉద్యోగి ఏ నియోజ‌క వ‌ర్గం కౌంటింగ్ లో పాల్గొంటారో తెలుస్తుంది. మే10 మంత్రి వ‌ర్గ స‌మావేశంపై ఎన్నిక‌ల ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళి ఎలా ఉందో దాని ప్రకారం అధికారులు న‌డుచుకోవాల్సి ఉంటుంది. ఏమైనా అనుమానాలుంటే.. సీఎస్ అధ్వర్యంలో ఉన్న క‌మిటి దానిని ప‌రిశిలించి సీఈవోకు పంప‌వ‌చ్చు. దానిని నేను కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి కోసం పంపుతారు. 

మే23 న కౌంటింగ్ జ‌రిగే రోజు మ‌ద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ రోజు.. కౌంటింగ్‌కు ముందు 17(సీ) ఫారం ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత ఈవీఎంల సీల్‌ను తొలగించి రిజల్ట్ బటన్‌ను నొక్కుతారు.

ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్‌లు ఉంటారు. లెక్కింపు ప్రక్రియ అంతా పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో సాగుతుంది. ప్రతి రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: