పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ఏ ముఖ్యమంత్రయినా సక్సెస్ అవ్వాలంటే మంచి టీం ను ఎంచుకోవాల్సుంటుంది. మంత్రివర్గం కూర్పు ఒక ఎత్తైతే తన కార్యాలయంలో పనిచేసే ఐఏఎస్ అధికారుల ఎంపిక మరో ఎత్తు. అలాగే ఇంటెలిజెన్స్, డిజిపి లాంటి కీలక స్ధానాల్లో మంచి సమర్ధులను గనుక నియమించుకుంటే సిఎ పనితీరుకు తిరుగే ఉండదు.

 

సచివాలయంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు సమర్ధవంతంగా అమలు కావాలంటే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల పనితీరే కీలకం. ఎందుకంటే, ఎక్కడో సచివాలయంలో తీసుకునే నిర్ణయాలు, వాటి అమలుపైనే జనాల్లో ముఖ్యమంత్రికి మార్కులు పడతుంటాయి. సిఎంకు మంచి మార్కులు పడాలంటే ముందు మంచి జట్టును తీసుకోవటంపైనే సిఎం సామర్ధ్యం ఆధారపడుంటుంది. చంద్రబాబునాయుడు ఫెయిలయ్యింది ఇక్కడే.

 

జగన్ కుడా ఇపుడా విషయంలోనే జాగ్రత్తగా కసరత్తులు మొదలుపెట్టారట. మంత్రివర్గంలోకి సీనియర్లు, జూనియర్ల మేలు కలయికను తీసుకోవాలన్నది జగన్ ఉద్దేశ్యంగా చెబుతున్నారు. మంత్రివర్గంలో సిఎం కాకుండా 25 మందికి అవకాశం ఉంది. ఇందులో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మర్రి రాజశేఖర్, చంద్రమౌళికి మంత్రిపదవులు హామీ ఇచ్చారు.

 

ఇందులో కుప్పంలో చంద్రమౌళి గెలిచేది లేదనుకోండి అది వేరే సంగతి.  ఇక మర్రి రాజశేఖర్ కు ఎంఎల్సీని చేసి మంత్రిపదవి హామీ ఇచ్చారు. అంటే 25 మంత్రిపదవుల్లో నలుగురు రెడీ అయిపోయారనే అనుకుందాం. మిగిలిన 21లో అన్నీ ఇపుడే భర్తి చేసేయరు. ఓ 15 మందిని తీసుకున్నా సీనియారిటీ, రెండోసారి ఎంఎల్ఏలవ్వటం లాంటివేవో కొలమానాలు పెట్టుకుంటారు.

 

సరే మంత్రిపదవులను పక్కన పెట్టేస్తే సిఎంవో చాలా కీలకం. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంనే కంటిన్యు అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఆర్ధిక సలహాదారుగా మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ్ కల్లంను తీసుకుంటారని సమాచారం.  అదే విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా కేంద్ర సర్వీసుల్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, డిజిపిగా గౌతమ్ సవాంగ్ ను నియమిస్తారని తెలుస్తోంది.  సిఎంవోలో కావాల్సిన ఐఏఎస్ లపై న కూడా జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ట్రాక్ రికార్డు బాగా ఉన్న వాళ్ళనే తీసుకుంటే పాలన సాఫీగా సాగిపోతుందనేది జగన్ భావనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: