టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ ను తొలగించింది కొత్త యాజమాన్యం. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఆ ఛానల్ యాజమాన్య సంస్థ అయిన ఏబీసీఎల్ బోర్డు డైరక్టర్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. డైరెక్టర్లలో ఒకరైన సాంబశివరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.


"అలంద మీడియా తొమ్మిది నెలల క్రితం ఏబీసీఎల్ లో 90.5 శాతం షేర్లను కొనుగోలు చేసింది. అయితే చానల్ ను పూర్తిగా మా అధీనంలోకి తీసుకోవడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. చానల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, అక్కడి నుంచి మార్చిలో అనుమతులు వచ్చాయి. బోర్డు మీటింగ్ లు నిర్వహించాలని రవిప్రకాశ్ ను, మూర్తిని కోరితే న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయంటూ వాళ్లు తీవ్ర జాప్యం చేశారు.. అంటూ వివరించారు సాంబశివరావు. 

ఆ విషయం ఓకే.. కానీ.. అసలు రవిప్రకాశ్ పై కేసు ఎందుకు పెట్టారు.. ఈ కేసు వివరాలేంటి.. అని ఓ విలేఖరి ప్రశ్నించగా సాంబశివరావు సమాధానం దాటవేశారు. అసలు రవిప్రకాశ్ తో మీకు గొడవ ఏంటి.. రవిప్రకాశ్ పై మీ అభియోగాలు ఏంటి.. అని అడిగినా ఆయన సరిగ్గా సమాధానం చెప్పకుండా దాటేశారు. 

ఆ విషయం ఏబీసీఎల్ సంస్థ వారు మీకు చెబుతారు. ఈ రోజు.. ఈ విషయం చెప్పడానికే వచ్చాం.. అంటూ వ్యవహారాన్ని దాటేశారు తప్పితే అసలు సమాధానం మాత్రం చెప్పలేదు. అంటే రవిప్రకాశ్ తో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. రవిప్రకాశ్ గురించి నెగిటివ్ గా మాట్లాడేందుకు ఏమాత్రం ఇష్టపడలేదంటే ఏదో ఉంది కథ అని రిపోర్టర్లు చెవులు కొరుక్కున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: