బాబు, మోడీ..అభివ్రుధ్ధికి జోడి. ఇదీ అయిదేళ్ళ క్రితం 2014 ఎన్నికల్లో వూరూరా తిరిగి చెప్పిన మాట. ఏపీ జనం నమ్మి ఇద్దరికీ ఓటేశారు. అక్కడా ఇక్కడా ఇద్దరు కుర్చీలు సంపాదించారు. ఇద్దరూ కలసి నాలుగేళ్ళు కాపురం కూడా చేశారు. అక్కడ టీడీపీ మంత్రులు, ఇక్కడ బీజేపీ  మంత్రులు కలసి పాలన చేశారు. అంతా బాగుంది అనుకుంటున్న వేళ బాబు సడెన్ గా తన స్వార్ధం కోసం ప్లేట్ ఫిరాయించి మోడీకి రాం రాం అనేశారు. ఇపుడు ఇద్దరు భీకరమైన పోరాటం చేస్తూ శత్రువులు అయిపోయారు.



ఇపుడు మోడీ ఓడిపోవాలని చంద్రబాబు మనసారా కోరుకుంటున్నారు. మరో వైపు బాబు ఏపీలో మాజీ అయిపోవాలని మోడీ మొక్కుకుంటున్నారు. బాబుకు పని లేక దేశమంతా తిరుగుతున్నారని మోడీ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో టీడీపీ ఓడిపోతుందని తెలిసే దిక్కు తోచక బాబు దేశాలు పట్టరని మోడీ సెటైర్లు వేశారు. బాబులో ఓటమి భయం కనిపిస్తోందని కూడా ఆయన అన్నారు. ఇక చంద్రబాబు నిన్నటికి నిన్న పార్టీ నాయకులతో మాట్లాడుతూ, మోడీ ముఖంలో ఓటమి కళ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మోడీ కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు.


తాను అయిదేళ్ళ పాటు దేశానికి చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేకనే మోడీ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని బాబు ఎండగట్టారు. మరి ఇక్కడ బాబు ఏపీలో వ్యక్తిగత విమర్శలు జగన్ మీద చేయలేదా. ఆయన బాబాయి హత్యను రాజకీయంగా వాడుకోలేదా బాబు అయిదేళ్ల తన పాలన గురించి ఎందుకు చెప్పుకోలేకపోయారని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికి చూస్తే అక్కడ మోడీ, ఇక్కడ బాబు ఇద్దరి పరిస్థితి ఈసారి అసలు బాగోలేదు. ఇద్దరూ ఎన్నికల్లో చమడోస్తున్నారు. ఇద్దరినీ మే 23 భయపెడుతోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: