టీడీపీకి ఓటమి ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి. అయితే టీడీపీ అనుకూల మీడియాగా చెప్పుకునే పత్రికలు కూడా టీడీపీ ఓటమిని ఒప్పుకోవటం ఇప్పుడు విశేషం. కేంద్రంలో ఈసారి ఎవరు వచ్చినా మిత్రపక్షాల మద్దతుతోనే అంటూ ఈరోజు బ్యానర్ ఐటమ్ రాసిన ఈనాడులో ఎక్కడా టీడీపీ ప్రస్తావన కనిపించలేదు. సొంతంగా మద్దతు రాకపోతే బీజేపీ మిత్రపక్షాల మద్దతు తీసుకుంటుందని, అదీ కుదరకపోతే.. కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలను కూడా లాగేసుకుంటుందని, అంతగా అవసరమైతే బీజేపీకి తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ మద్దతు ఉంటుందని తేల్చేసింది.


ఈనాడు లెక్కప్రకారం ఏపీలో టీడీపీ హవా ఉంటే.. వైసీపీ మద్దతుతో బీజేపీ ఏం సాధిస్తుంది. పోనీ కాంగ్రెస్ కూటమి గురించి లెక్కలు తీసేటప్పుడు కూడా ఎక్కడా టీడీపీ సీట్లు కలపలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, డీఎంకే, టీఎంసీ.. విషయాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంది. అంతిమంగా టీడీపీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కే స్కోప్ లేదని తేల్చిపారేసింది ఈనాడు. అయితే అలవాటులో పొరపాటుగా చంద్రన్నను గొప్ప వ్యూహకర్తగా పేర్కొంది.


మరీ బీజేపీకి పరిస్థితి విషమిస్తే, విపక్ష కూటమిలోని పార్టీలు చేజారిపోతాయని చంద్రబాబు ముందే పసిగట్టారని, అందుకే బీజేపీకి ఎవరూ దొరక్కుండా ముందుగానే వ్యూహరచన చేస్తున్నారని పేర్కొంది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. దాదాపు ఇదే విషయాన్ని బాబు తోక పత్రిక కూడా ఈరోజే చెప్పుకొచ్చింది. చంద్రబాబుకు ఏపీలో ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని వదిలేసి, జాతీయస్థాయిలో గొప్ప వ్యూహకర్త చంద్రబాబు అంటూ పెద్ద ఆర్టికల్ అచ్చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: