టీడీపీ అనుకూల మీడియా రాస్తున్న కథనాలు వైసీపీ దే అధికారం అని చెప్పకనే చెబుతున్నాయి. ప్రతిరోజు టీడీపీ అనుకూల మీడియాలో జగన్ సీఎం అవుతాడని ఇండైరెక్ట్ కథనాలు రాస్తున్నాయి. మొన్నటికిమొన్న ఆర్టీసీపై ఆ పత్రిక ప్రచురించిన కథనం చదివితే, అది ఆర్టీసీ కష్టాలపై రాసినట్టు అనిపించదు, నెక్ట్స్ ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్లకు ఆర్టీసీ ఓ గుదిబండలా మారుతుందని రాసుకొచ్చింది. తాజాగా ఆ పత్రిక మరో కథనం కూడా రాసుకొచ్చింది.


ఈసారి అధికారంలోకి ఎవరొచ్చినా రెవెన్యూ లోటు భర్తీచేయడం దాదాపు అసాధ్యం. ఇక ఈరోజు వచ్చిన కథనం మరోఎత్తు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదట. బడ్జెట్ మొత్తం పింఛన్లు, ఉద్యోగుల జీతాలకే అయిపోతుందట. ఇలా వారం రోజులుగా ఆ తోకపత్రిక ఇస్తున్న కథనాల్లో నేరుగా జగన్ పేరును ఎక్కడా ప్రస్తావించడం లేదు కానీ, జగన్ అధికారంలోకి వస్తే పరిపాలన సాగించడం అతడి వల్లకాదనే అర్థంవచ్చేలా ఉన్నాయి ఆ స్టోరీలు.


ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. ఈ సమస్యలు ఇప్పుడే కొత్తగా ఉత్పన్నం అయినవి కావు. గడిచిన ఐదేళ్లుగా ఉన్నవే. కానీ ఈ ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి కథనాలు రాయలేదు ఈ పత్రిక. జగన్ అధికారంలోకి వస్తాడనే నివేదికల నేపథ్యంలోనే ఇలాంటి భయపట్టే కథనాలు వస్తున్నాయని అర్థంచేసుకోవాలి. ఇదే కోవలో చూసుకుంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం జగన్ వల్ల కాదంటూ రేపోమాపో మరో పెద్ద కాలమ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడితో ఆగట్లేదు ఆ తోకపత్రిక. ఓవైపు ఇలా రాబోయే ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా స్టోరీలు అల్లుతూనే, మరోవైపు చంద్రబాబు వీరుడు-శూరుడు అనే కథనాల్ని అది కంటిన్యూ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: