టీవీ9లో వాటాల వ్యవహారంలో నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ అభియోగాలతో రవిప్రకాశ్‌తో పాటు సినీనటుడు శివాజీపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. రవిప్రకాశ్‌తో పాటు సినీనటుడు శివాజీ ఆదివారం తమ ఎదుట హాజరు కావాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. అయితే వాళ్లిద్దరూ ఇప్పటివరకూ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. రవిప్రకాశ్‌ ఫోన్‌ నిన్న మధ్యాహ్నం నుంచి స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయనతో పాటు శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప‌రిణామంపై విజ‌య‌సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.


``మెరుగైన సమాజ  ఉద్యమకారుడు శుక్రవారం మధ్యాహ్నం 3గం. నుంచి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశాడట. సైబరాబాద్ ఎస్వోటి పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళ్తే 23 తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్నాటక మీదుగా ముంబాయి చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?`` అంటూ ఎత్తిపొడిచారు. ఈ సంద‌ర్భంగానే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై సైతం విజ‌య‌సాయ‌రెడ్డి సెటైర్లు వేశారు.


``వరల్డ్ ఎకనిమిక్ ఫోరం సదస్సుల్లో ఆర్థిక వేత్తలకు పాఠాలు చెప్పానంటాడు. ఆర్టీసీని రూ.650 కోట్ల నష్టాల్లోకి ఎందుకు నెట్టావు చంద్రబాబూ? ఏటా రూ.650 కోట్ల నష్టాలొస్తుంటే తమరు నియమించిన ఎండీ సురేంద్రబాబు ఏం చేసినట్టు? పోలవరం సందర్శనకు బస్సులు సమకూర్చడంలో బిజిగా ఉన్నాడా?``అంటూ ప్ర‌శ్నించారు. ``దుర్భిక్ష పరిస్థితులతో అనంతపురంతో మరణ మృదంగం మోగుతోంది. వేలాది కుటుంబాలు కర్నాటకకు వలస పోతున్నాయి. పశువులు, గొర్రెలకు మేత లేక పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రెయిన్ గన్ల స్టోరీలు,నీటి గలగలలు, కియా కార్ల ఫ్యాక్టరీతో ఇంటికో ఉద్యోగం వచ్చిందని ఎన్నాళ్లు మోసం చేస్తారు.`` అని నిల‌దీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: