కొంత మందిని చూస్తే వారిని ఎప్పుడూ చూడాలనిపిస్తుంది..జీవితంలో ఎప్పుడు మర్చిపోలేమనిపిస్తుంది.  ముఖ్యంగా కొంత మంది అందమైన ఆడవారిని చూస్తే ఎప్పటికీ మర్చిపోలని విధంగా ఉంటారు.  సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో అందాలు..అద్భుతాలు మన కళ్లముందు ఉంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని  ఓ లేడి పోలింగ్ ఆఫీసర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.   అల్ట్రామోడల్‌గా ఉన్న ఈ పోలింగ్ ఆఫీసర్ ఫొటోకి ఇప్పుడు నెట్టింట్లో విశేష స్పందన లభిస్తోంది.

దీనిపై నెటిజన్లు సూపర్ ఆఫీసర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెండు చేతుల్లోనూ ఈవీఎం బాక్స్‌లను పట్టుకొని చాలా మోడ్రన్ లుక్‌లో ఈ అధికారి కనిపించేసరికి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా క్లిక్ మనిపించారు.  అయితే సినిమా హీరోయన్లనే మై మరపించేలా ఉన్న ఈ అందగత్తె ఎవరా అని అందరూ ఆమె పేరు కోసం వెతకడం ఆరంభించారు.  మొత్తానికి ఆమె ఎవరో తెలిసింది. ఆమె పేరు రీనా ద్వివేది అని తెలిసింది.

ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలోని నగ్రామ్ 173 పోలింగ్ బూత్‌కు మే 5న ఎలక్షన్ డ్యూటీకి వెళ్తూ కెమెరాలకు చిక్కారట. మరో ట్విస్ట్ ఏంటంటే ఆమె ఎక్కడ ఉన్నా అక్కడ దాదాపు వంద శాతం పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుందని టాక్ వచ్చింది.  అవును మని ఇంత అందగత్తె పోలింగ్ బూత్ లో ఉంటే..తప్పకుండా ఓటేస్తారని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారట.


మరింత సమాచారం తెలుసుకోండి: