తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క ఘ‌ట్టాన్ని పూర్తి చేశారు. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయనున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను ఆదివారం సాయంత్రం ప్రకటించారు. సీనియ‌ర్లు, మాజీ నేత‌లు, యువ‌కుల‌కు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అవ‌కాశం క‌ల్పించారు.


రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డిని కేసీఆర్‌ ఖరారు చేశారు. ఆయా జిల్లాల మంత్రులతో సీఎం సమావేశమై అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. ముగ్గురు అభ్యర్థులకు బి-ఫారాలను కూడా ఇవ్వనున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని, సునాయాసంగా విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.


ఇదిలాఉండ‌గా,  సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్.. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత లాంటి అంశాలపై కేసీఆర్.. స్టాలిన్‌తో చర్చించనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఇటీవలే కేరళ, తమిళనాడు పర్యటనకు వెళ్లి వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: