వైకాపాకు చెందిన దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. దర్శిలో బూచేపల్లి కుటుంబానికి ప్రజాదరణ ఉంది. 

ఒకసారి సుబ్బారెడ్డి, మరోసారి ఆయన కుమారుడు శివప్రసాద్‌రెడ్డి దర్శి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కేవలం 1200 ఓట్ల తేడాతోనే శివప్రసాద్‌రెడ్డి ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన్నే మరోసారి పోటీకి దింపాలని జగన్ భావించారట. 

దర్శి నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, అభిమానులతోపాటు, ఆ పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా  మళ్లీ పోటీ చేయాలని శివప్రసాదర్ రెడ్డిపై  తీవ్ర ఒత్తిడి వచ్చిందట. తండ్రి అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారట శివప్రసాదరరెడ్డి. 

ఎన్నికల హడావిడి ప్రారంభమయ్యేనాటికే సుబ్బారెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ తర్వాత గుండె సమస్య కూడా వచ్చింది. మెరుగైన వైద్యం అందించడంతోపాటు, దగ్గర ఉండి సేవలను చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని శివప్రసాద్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. అందుకే జగన్ ఒత్తిడి చేసినా నిర్ణయం మార్చుకోలేదట. 



మరింత సమాచారం తెలుసుకోండి: