అదేంటి జగన్ గెలిస్తే బాబు పండుగ చేసుకోవడమేంటి. అనుకుంటున్నారా.. అవును మరి. ఒకవేళ చంద్రబాబు గెలిచినా.. ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడపడం కత్తిమీద సామేనట. ఎందుకంటే ఆ స్థాయిలో ఏపీ సర్కారు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వైసీపీ విమర్శిస్తోంది.  


తన స్వార్థం కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశాడని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే కుట్రతో ఖజానాను ఖాళీ చేశాడని మండిపడుతోంది. తనకు అనుకూల కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకునేందుకు సెంట్రల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సంస్థలో తన మనుషుల ద్వారా
క్రమపద్ధతి లేకుండా చంద్రబాబు బిల్లులు చెల్లించుకున్నారని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా తన కాంట్రాక్టర్లకు చంద్రబాబు బిల్లులు చెల్లించుకొని ఖాజానాను ఖాళీ చేశాడని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తరువాత వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకకూడదని చట్ట పరిధి దాటి చంద్రబాబు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించాడన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్, పరిశీలనలో ఉన్నవి  3.46 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించాలని ఆయన వివరించారు. 

చంద్రబాబుకు ప్రభుత్వాన్ని నడిపే అర్హత ఉందా..? వివిధ రంగాలకు చెల్లించాల్సిన సబ్సిడీలు రూ. 828 కోట్లు, హాస్టల్‌ బిల్స్‌ దాదాపు రూ. 78 కోట్లు, ఈపాస్‌ బిల్లులు 1248 కోట్లు, వివిధ కార్పొరేషన్స్‌కు గ్రాంట్స్‌గా ఇవ్వాల్సిన డబ్బు రూ. 4800 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ పథకాల కోసం చేపట్టిన భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణాలకు అత్యవసరంగా రూ. 880 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూసేకరణకే రూ. 693 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులు రాక, ఎంత మంది ఎదురు చూస్తున్నారన్నారు శ్రీకాంత్ రెడ్డి. 



మరింత సమాచారం తెలుసుకోండి: