అందరూ అనుకుంటున్నట్లే, సర్వేలన్నీ చెబుతున్నట్లే ఉంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు కూడా. జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి ? ఓడిపోతాననే భయం కూడా తనకు లేదంటూ పార్టీ సమావేశంలో చెప్పారు. జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్ధులతో పవన్ మాట్లాడుతూ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని తాను లెక్కేసుకోవటం లేదన్నారు.

 

తాజా మాటలను బట్టే జేనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో పవన్ కు ఓ అంచనా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఏ రాజకీయ పార్టీ అయినా గెలవటానికే పోటీ చేస్తుంది. గెలుపు అవకాశం లేదని తేలిపోయిన తర్వాతే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతుంది. జనసేన అధినేత మాట్లాడిన మాటలు కూడా ఇలాగే ఉంది. గెలవటానికి కాకపోతే పవన్ ఎందుకు పోటీ చేసినట్లు ? వైసిపిని దెబ్బకొట్టి చంద్రబాబునాయుడును గెలిపించటానికేనా ?

 

మొన్నటి ఎన్నికల్లో జనసేన 140 సీట్లలో పోటీ చేసింది. అయితే మొదటి నుండి పవన్ పోటీ చేస్తున్నది వైసిపిని దెబ్బకొట్టి చంద్రబాబుకు మేలు చేసేందుకే అన్న ఆరోపణలు, ప్రచారం అందరికీ తెలిసిందే.  దానికి తగ్గట్లే కొన్నిచోట్ల జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్ధుల ఎంపిక కూడా దాన్నే చెబుతోంది.

 

ఇపుడు పవన్ కూడా అలాగే మాట్లాడారు. జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో తనకు దృష్టి లేదన్నారు. తనకు ఓటమి భయం కానీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో పట్టింపే లేదట. పోరాటం చేశామా లేదా అన్న విషయం మాత్రమే తనకు కావాలట.  గెలిచే సీట్లకన్నా ఎన్ని శాతం ఓట్లు వచ్చాయన్నదే తనకు ముఖ్యంగా చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

రాజకీయాల్లో సహనం ఓపిక చాలా అవసరమన్నారు. నిజానికి ఈ రెండు లేనిదే పవన్ కు. స్టేజికి మీదకు ఎక్కితే ఏం మాట్లాడుతారో కూడా పవన్ కు తెలీదు. ఒక్కోసారి మాట్లాడుతూ మాట్లాడుతునే మధ్యలో గట్టి గట్టిగా అరిచి గోలపెట్టేస్తారు. కాబట్టి పైన చెప్పిన రెండు పవన్ కు వర్తించవు. ఇక ఎంఎల్ఏ, ఎంపి ఎన్నికల సంబరం అయిపోయింది కాబట్టి స్ధానిక సంస్ధలపై నేతలందరూ దృష్టి పెట్టాలని ఆదేశించారు. మరి ఈ ఎన్నికల్లో అయినా గెలవంట కోసమే పోటీ చేస్తారా ? లేకపోతే ఓట్ల శాతం కోసమే అంటారా అన్నది చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: