ఏపీలో ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఆయన ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తూ మీడియాలో హడావుడి చేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మిగతా పక్షాలు పెద్దగా కలిసిరాకున్నా, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ వద్ద వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా ఒంటెద్దుపోకడలు మానడం లేదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే అంతా తానే చేశానని చెప్పుకోవాలని ఆశపడ్డ బాబుకు షాక్ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ నెల 21న ఢిల్లీలో జరుగనున్న విపక్షాల మహాకూటమి సమావేశానికి పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్టు విశ్వసనీయ సమాచారం.  


 ఏపీ సీఎం చంద్రబాబు గతవారం మహాకూటమి సమావేశంపై చర్చించేందుకు పశ్చిమబెంగాల్‌కు వెళ్లారు. అయితే మమతాబెనర్జీ నుంచి ఆశించిన స్పందన రాలేదని సమాచారం. ఈ నెల 23న ఫలితాల వెల్లడికి ముందు ఎలాంటి సమావేశం అవసరం లేదని దీదీ తేల్చిచెప్పినట్టు తెలిసింది. మాయావతి, అఖిలేశ్‌యాదవ్ నుంచి కూడా ఇలాంటి సమాధానమే వచ్చినట్టు సమాచారం. దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భా వించిన చంద్రబాబుకు చుక్కెదురైంది. 


మమతాబెనర్జీ, మాయావతి.. ఇద్దరూ ప్రధాని పీఠంపై కూర్చోవాలని ఎన్నాళ్లుగానో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ప్రతిపక్ష కూటమి తరఫున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం రాహుల్‌కు బహిరంగంగా మద్దతు పలికారు. దీంతో మాయావతి, మమతాబెనర్జీ కొన్నాళ్లుగా కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా బాబుకు షాక్ ఇచ్చారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: