ప్ర‌ముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ రిజిస్ట్రేష‌న్‌ను కేంద్ర హోంశాఖ ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ రిజ‌స్ట్రేష‌న్‌ను ర‌ద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ నిర్ణ‌యం తీసుకుంది. విదేశీ నిధులు తీసుకునే విష‌యం నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డం వ‌ల్లే ఆ సంస్థ రిజిస్టేష‌న్ ర‌ద్దు చేస్తూ.. నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని అధికారులు వెల్ల‌డించారు. 


ఒక వేళ స్వ‌చ్ఛంధ సంస్థ‌లు విదేశాల నుంచి విరాళాలు గానీ, డొనేష‌న్స్ గానీ ఏమైనా పొందాల‌నుకుంటూ వారు త‌ప్ప‌ని స‌రిగా ఫారిన్ కంట్రిబ్యూష‌న్స్(రెగ్యూలేష‌న్‌) యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద రిజిస్టర్‌ చేసుకోవాలి. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కూడా రిజిస్టర్‌ అయ్యింది. 


అయితే ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ప్రకారం.. రిజిస్టరయిన‌ స్వచ్ఛంద సంస్థలు ప్ర‌తి ఏడాది త‌మ ఆనువ‌ల్ ఇన్‌క‌మ్‌.. విదేశీ నిధుల ఖ‌ర్చులు.. బ్యాలెన్స్ షీట్ వంటివి స‌మ‌ర్పించాల్సి ఉంది. అటు విదేశీ నుంచి నిధులు రాక‌పోయినా స‌రే ‘NIL’అంటూ రిట‌ర్నులు దాఖ‌లు మాత్రం ఖ‌చ్చితంగా చేయాల్సిందే. 


గత ఆరేళ్లుగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తమ ఆదాయ, వ్యయాలను వెల్లడించ‌లేదు.ఈ మేర‌కు దీనిపై నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు. అయినప్ప‌టికీ సంస్థ స్పందించలేదు. ఎంత‌కు స్పందించ‌క‌పోవ‌డంతో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కూడా ధ్రువీకరించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: