దేశంలో రాజకీయమంతా తెలుగు రాష్టాలలోనే  ఉన్నట్లుంది. గత కొన్ని నెలలుగా కాలికి బలపం కట్టుకుని మరీ చంద్రబాబు దేశాటన చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని జాతీయ స్థాయిలో  తాను చక్రం తిప్పాలని చూస్తున్నారు. అయితే రాజకీయం అంటే ఎపుడూ ఒకేలా ఉండదు కదా 1996 నుంచి 2004 వరకూ కధ వేరు. ఆ తరువాత కధ వేరు అన్నట్లుగా తెలుగు రాష్ట్రాలో పరిస్థితి ఇపుడు  ఉంది.


2004 వరకూ ఉమ్మడి ఏపీలో చంద్రబాబే కింగ్. ఆయనకు పోటీగా కాంగ్రెస్ ఉంది. దాంతో ప్రతిపక్షాలకు బాబు పెద్ద బలంగా, బలగంగా కనిపించారు.  ఆ తరువాత బాబు ఓడిపోవడం, ఏపీ రెండు ముక్కలు కావడం, వైసీపీ ఏర్పాటు ఇలా ఎన్నో పరిణామాలు జరిగాయి. ఇపుడు తెలుగు రాష్ట్రాలు అంటే బాబు ఒక్కడే కాదు. కేసీయార్, జగన్ కూడా ఉన్నారు. పైగా రాజకీయంగా ఎదురులేని స్థితిలో కేసీయార్ ఉంటే, జగన్ ఏపీలో బాబుకు పక్కలో బల్లెంగా మారి రేపటి రోజున అధికారం గుంజుకునేలా ఉన్నాడు.


ఇక బాబుకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. దాంతో దేశంలోకి ఇతర పార్టీలు ఇపుడు కేసీయార్ తోనూ చెట్టాపట్టాలు వేస్తున్నాయి. కన్నడ కుమారస్వామి, తమిళనాట స్టాలిన్ మాత్రమే కాదు ఉత్తరాదిన అఖిలేష్ యాదవ్, మాయావతి, మమత ఇలా వీరంతా ఇపుడు కేసీయార్, జగన్ లతో టచ్ లో ఉంటున్నారని టాక్. ఇదే బాబుకు మంట పుట్టిస్తోంది. తాను కష్టపడి తిరగడమేంటి, వీరు ఇలా తన్నుకుపోవడమేంటి అన్నది బాబుకు పట్టుకున్న బాధ. అయినా రాజకీయం ఇది. అవకాశాలు  ఇక్కడ ముఖ్యం. పైగా ఏపీలో జగన్ ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకుంటారని అంటున్నారు. దాంతో ఆయన వైపు రాజకీయం తిరుగుతోంది. 


ఈ రోజు స్టాలిన్ ని కేసీయార్ కలవడం వెనక జగన్ ఉన్నాడని టాక్ కూడా ఉంది. అలాగే అఖిలెష్ కి జగన్ మంచి మిత్రుడు, ఇలా తన పాత రిలేషన్లు అన్ని జగన్ బాగా ఉపయోగిస్తున్నారు. తెర వెనక జగన్, తెర ముందు కేసీయార్, మొత్తానికి బాబుకు తలనొప్పి బాగానే తెస్తున్నారు. మరి తెలుగునాట సాగుతున్న ఈ రాజకీయ పోరాటంలో ఎవరు డిల్లీని శాసిస్తారో చూడాల్సిందే.
.


మరింత సమాచారం తెలుసుకోండి: