ఆయ‌నో మాజీ పోలీస్ అధికారి. రాయ‌ల‌సీమ ర‌క్తం కుత‌కుత‌లాడుతున్న ఆయ‌న‌లో.. అధికారిగా ఉండ‌గానే చాలా దూకు డు ప్ర‌ద‌ర్శించి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమ‌య్యారు. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. అదికూడా అధికార టీడీపీని కాద‌ని విప‌క్షం వైసీపీ తీర్తం పుచ్చుకున్నారు. టీడీపీకి కంచుకోట వంటి అనంత‌పురంలోకి అత్యంత ప‌టిష్ట ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న టీడీపీ నియోజ‌క‌వ‌ర్గం హిందూపురం నుంచి ఎంపీగా ఆయ‌న బ‌రిలోకి దిగారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం పేరు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి కేంద్రీక‌రించేలా అయింది. 

ఆయ‌నే.. గోరంట్ల మాధ‌వ్‌. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అంచెలంచెలుగా ఎదిగిన మాధ‌వ్ సీఐగా ఉన్న స‌మ‌యంలో చేసిన దూకుడుతో రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ముఖ్యంగా నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఓ వ్య‌క్తిని బ‌హిరంగంగానే చిత‌క బాది.. వివాదాస్ప‌ద‌మ‌య్యాడు. ఇక‌, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డితో పెట్టుకుని మ‌రింత‌గా రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించారు. పోలీసుల‌ను థ‌ర్డ్ జండ‌ర్‌గా పోల్చి మాట్లాడిన జేసీ నాలుక కోస్తానంటూ అప్ప‌ట్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌ట్ చేస్తే.. ఎన్నిక‌ల‌కు కేవ‌లం మూడు మాసాల ముందు ఆయ‌న త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 

వ‌చ్చీరావ‌డంతోనే ఆయ‌న హిందూపురం ఎంపీ ప‌ద‌వికి పోటీ చేశారు. నామినేష‌న్ల గ‌డువు ముగిసే వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆయ‌న వాలంట‌రీ రిట‌ర్మెంట్‌ను ఆమోదించ‌క‌పోవ‌డం, ఈ క్ర‌మంలో కోర్టు జోక్యం అంద‌రికీ తెలిసిందే. చిట్ట‌చివ‌రి నిముషంలో మాధ‌వ్ వీఆర్‌నుఆ మోదించ‌డంతో నామినేష‌న్ క‌థ సుఖాంత‌మైంది. దీంతో ఇక్క‌డ నుంచి పోటీకి దిగిన మాధ‌వ్ గెలుపుపై జిల్లాలోనే కాకుండా రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక్క‌డ నుంచి గెలిచి త‌న స‌త్తా చాటాల‌ని మాధ‌వ్ నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇక్క‌డ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌కే చంద్ర‌బాబు మ‌రోసారి టికెట్ ఇచ్చారు. దీంతో ఇక్క‌డ హోరా హోరీ పోరు సాగింది. మ‌రి ఎవరు గెలుస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఈ నెల 23న ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పు ఏం టో తెలియ‌నుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: