మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చంద్రబాబునాయుడు తేల్చేశారు. కర్నూలు జిల్లా నేతలతో సమీక్ష చేసిన చంద్రబాబు మాట్లాడుతూ టిడిపికి 110 సీట్లు  గెలుస్తుందని తాజాగా చెప్పారు. మొన్నటి వరకూ టిడిపికి 150 సీట్లు ఖాయమని చెప్పిన ఇదే చంద్రబాబు తాజాగా మాత్రం 40 సీట్లు తగ్గించేయటం గమనార్హం.

 

పోలింగ్ జరిగిన వారంరోజుల వరకూ ఈవిఎంల మీద, ఎలక్షన్ కమీషన్ పైన విరుచుకుపడటంతోనే చంద్రబాబుకు సరిపోయింది. ఎప్పుడైతే ఈవిఎంలను తప్పుపడుతూ, ఎలక్షన్ కమీషన్ కు శాపనార్ధాలు పెడుతున్నారో దాంతోనే తమ్ముళ్ళు ఓటిమిని ఖాయం చేసేసుకున్నారు. అదే విషయాన్ని తమ్ముళ్ళు చంద్రబాబుతో స్పష్టం చేశారు.

 

దాంతో టిడిపికి జరిగిన డ్యామేజిని గుర్తించిన తర్వాత నుండి టిడిపి గెలుస్తోందంటూ మొదలుపెట్టారు. టిడిపి 130 సీట్లతో గెలుస్తోందని ఒకసారి లేదు..లేదు 150 సీట్లు గ్యారెంటీ అని మరోసారి చెప్పారు. మొత్తానికి ఏమనుకున్నారో ఏమోకానీ 150 సీట్ల దగ్గర ఫిక్స్ అయిపోయారు. నిజంగానే టిడిపికి 150 సీట్లు కాదుకదా గెలిచేంత సీన్ ఉన్నా చంద్రబాబు వ్యవహారం వేరే విధంగా ఉండేది.

 

మొన్నటి వరకూ టిడిపికి 150 సీట్లొస్తాయని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఒక్కసారిగా 40 సీట్లు తగ్గించుకుని 110 సీట్లకే ఎందుకు పరిమతమయ్యారో అర్ధం కావటం లేదు. ఫలితాలు వచ్చేందుకు ఇంకా తొమ్మిది రోజులుండగానే చంద్రబాబు లెక్కలో 40 సీట్లు తగ్గిపోతే రాబోయే రోజుల్లో ఇంకెన్ని సీట్లు తగ్గిపోతాయో తమ్ముళ్ళకు  అర్ధం కావటం లేదు.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే, పోట చేసిన అభ్యర్ధులే తమకు ఎక్కడ బొక్క పడుతున్నదో, తమ గెలుపుకు ఎవరు అడ్డుకట్ట వేశారో చెబుతున్నారు. పార్టీలోని సీనియర్ నేతలే తమ గెలుపుకు ఏ విధంగా నష్టం చేసింది ఫిర్యాదులు చేసుకుంటున్నారు. టిడిపిలోనే ఉంటూ వైసిపి గెలుపుకు సహకరించిన వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తున్నారు. అయినా కానీ టిడిపి అభ్యర్ధులదే గెలుపని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తుండటంతో తమ్ముళ్ళకి ఏడవాలో నవ్వాలో కూడా అర్ధం కావటం లేదట.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: