అవును అందరూ ఇపుడిదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. అవసరం లేకపోయినా పంతానికి పోయి క్యాబినెట్ సమావేశం పెట్టాలని చంద్రబాబునాయుడు అనుకున్నారు. అనుకున్నట్లే క్యాబినెట్ సమావేశం కూడా పెట్టారు. కానీ ఏం సాధించినట్లు ? ఇపుడిదే ఎవరికీ అర్ధం కావటం లేదు. క్యాబినెట్ సమావేశంలో చర్చించే అంశాలను ముందే చెప్పాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశించింది.

 

సీఈసీ ఆదేశించినట్లే నాలుగు అంశాలను ముందుగా ఎన్నికల సంఘానికి పంపారు. వాటిపై ఫీడ్ బ్యాక్ తీసుకున్న ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దాంతో ముందుగానే చంద్రబాబు అడుగులకు బంధాలేసినట్లుగా అయిపోయింది. అంశాలను తనకు పంపమని ఆదేశించటం, షరతులతో కూడిన అనుమతి ఇవ్వటంతోనే చంద్రబాబు క్యాబినెట్ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత లేదని తేలిపోయింది.

 

అదే సమయంలో విధానపరమైన అంశాలేవీ చర్చ చేయకూడదని, ఆర్దిక పరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోకూడదని కూడా ముందుగానే హెచ్చరించటంతో చంద్రబాబు చేయగలిగేదేమీ లేకపోయింది. కేవలం ఫణితుపాను, కరువు, మంచినీటి ఎద్దడి, ఉపాధిహామీ పథకం పై ఏదో చర్చించామంటే చర్చించామని అనిపించుకుని క్యాబినెట్ ముగించుకున్నారు. ఎందుకంటే, పై నాలుగు అంశాలపై క్యాబినెట్ చర్చించటానికి ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రుల్లో కూడా చాలామందికి పెద్దగా ఆసక్తి కూడా కనబడలేదు. ఎందుకంటే, నాలుగు అంశాలు తప్ప చర్చించటానికేమీ లేనపుడు పై శాఖలకు చెందిన నలుగురు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులేం చేస్తారు ?  అందులోనే పై శాఖల మంత్రులు కూడా కొత్తగా తీసుకునే నిర్ణయాలేమీ లేవు. ప్రతీరోజు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం రివ్యూలు చూస్తూనే ఉన్నారు.

 

మంత్రుల్లో సీరియర్లు కెఇ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు అసలు క్యాబినెట్ సమావేశమే అవసరం లేదని చెప్పారట. అయితే అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు లాంటి వాళ్ళు మాత్రం క్యాబినెట్ జరగాల్సిందేనని పట్టుబట్టారట. తాను కూడా క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తానని, హాజరుకాకపోతే ఐఏఎస్ లపై చర్యలుంటాయని హెచ్చరించిన తర్వాత సమావేశం పెట్టకపోతే ప్రిస్టేజ్ గా తీసుకుని చంద్రబాబు కూడా ఏదో సమావేశం అయ్యిందనిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: