మే 23 న  ఎన్నికల ఫలితాలు వెలువుడనున్న సంగతి తెలిసిందే. అందుకు ఈ సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బందిని సమయాత్తం చేస్తోంది. సమీక్షలు జరుపుతూ నిబంధనలను గుర్తు చేస్తోంది. ఈ సారి మరింత పకడ్బందీగా ఎన్నికల ఓట్ల లెక్కింపు జరపాలని ఈసీ నిర్ణయించింది. 


నిబంధనలను పక్కా అమలు చేయనున్నారు. ఓటింగ్‌ రహస్యానికి సంబంధించిన ప్రకటనపై సంతకం చేసిన తర్వాతే ఏజెంట్‌ను హాలులోకి పంపిస్తారు. ఏజెంటు ఏ అభ్యర్థికి చెందిన వారు, ఏ సీరియల్‌ నెంబరు టేబుల్‌ వద్ద లెక్కింపు గమనిస్తారో సూచించే బ్యాడ్జీలను రిటర్నింగ్‌ అధికారి ఇస్తారు. 

ఏజంట్ ఏ టేబుల్‌ కేటాయించారో అక్కడే కూర్చోవాలి కానీ హాలంతా తిరగడానికి వీల్లేదు. రిటర్నింగ్‌ అధికారి బల్ల దగ్గర ఉండే ఏజెంటు మిగిలిన ఏజెంట్లు లేని సమయంలో ఆ టేబుళ్ల దగ్గరకు వెళ్లడానికి ఓకే. ఒకసారి కౌంటింగ్‌ హాలులోకి ప్రవేశించిన తర్వాత బయటకు వెళ్లేందుకు వీలు లేదు. 

ఏంజట్లకు  కావాల్సిన అన్నిరకాల మౌలిక వసతులను లోపలే ఏర్పాటుచేస్తారు. టేబుల్స్‌ దగ్గర ఏజెంట్ల సీట్ల కేటాయింపు పార్టీల గుర్తింపు ఆధారంగా ఉంటుంది. ముందు  గుర్తింపు పొందిన జాతీయ పార్టీ ఏజెంటు ఉంటారు. ఆ తర్వాత గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల ఏజెంట్లు ఉంటారు. ఆ తర్వాత నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొంది, ఇతర చిహ్నాలను ఉపయోగించుకున్న అభ్యర్థుల ఏజంట్లు.. తదుపరి నమోదై గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ఏజంట్లు ఉంటారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: