ప్రత్యేక హోదా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ. అంతేనా.. ఏపీ విభజన సమయంలో పార్లమెంట్ ఇచ్చిన హామీ.. ఏకంగా అప్పటి ప్రధానమంత్రి పార్లమెంట్‌లో స్వయంగా భరోసా ఇచ్చిన అంశం.. అంతేకాదు.. విభజన బిల్లులోనూ భరోసా ఇచ్చిన విషయం.


కానీ ఆ భరోసాను బీజేపీ సర్కారు నెరవేర్చలేదు.. నాలుగేల్లు ఆ పార్టీతో కలసి కాపురం చేసిన తెలుగుదేశం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ప్యాకేజీ ఇస్తామనగానే ఒప్పుకుని అదే పదివేలంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు సీన్ అర్థమై.. చివరి ఎనిమిది నెలల ముందు కళ్లు తెరచి మళ్లీ ప్రత్యేక హోదా అంటూ నినదించింది.

వైసీపీ ఈసారి ఎవరు అధికారంలోకి వచ్చినా హోదా ఇచ్చేవారికే మద్దతు అని ప్రకటించింది. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదాకు మరో ముప్పు వచ్చి పడింది. పొరుగున ఉన్న ఒడిశా తమకు కూడా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తోంది. అందుకు ఆ రాష్ట్రం చెప్పే కారణం తుపానులు. 

తుపానులతో తాము బాగా నష్టపోతున్నాం కాబట్టి ప్రత్యేక హోదా కావాలిని నవీన్ పట్నాయక్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి డిమాండ్ కారణంగా ఏపీకి హోదా విషయంలో కేంద్రం వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది. మరో పక్క బీహార్‌లోని ఇదే డిమాండ్ వినిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: