మే నెలలో 28న మహానాడు జరపుకోవడం తెలుగుదేశం ఆనవాయితీ.. ఇది ఎన్టీఆర్ హయాం నుంచీ వస్తుంది. మే 28 ఎన్టీఆర్ జయంతి.. ఆ రోజే పార్టీ మహానాడు జరుపుకుంటుంది. కానీ ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 


ఇలాంటి సమయంలో మహానాడు నిర్వహించడం అవసరమా అన్న చర్చ టీడీపీ నేతల భేటీలో వచ్చినట్టు తెలుస్తోంది. మహానాడు స్థానంలో భారీ ఎత్తున ఎన్టీఆర్ జయంతి వేడుకలకు చేద్దామని కొందరు నేతల ప్రతిపాదించారట. ఫలితాలకు మహానాడు తేదీలకు ఎంతో గ్యాప్ లేదని నేతలు గుర్తు చేస్తున్నారు. 

జాతీయ స్థాయిలో జరిగే వరుస  సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనాల్సిన అవసరం ఉంది కాబట్టి మహానాడు నిర్వహణ ఇబ్బంది అవుతుందన్న వాదన కూడా వచ్చిందట. మొత్తానికి సమయాభావం, చంద్రబాబు బిజీ షెడ్యూల్ దృష్టిలో పెట్టుకుని  మహానాడు నిర్వహించే ఆలోచన లేదని నాయకులు చెబుతున్నా.. అసలు కారణం వేరే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

తమ వాదనకు మద్దతుగా గతంలో వివిధ సందర్బాల్లో మహానాడు నిర్వహించలేదన్న విషయాన్ని కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. గతంలో పార్టీ గెలిచిన సందర్భాల్లోనూ  మహానాడు నిర్వహించలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ఇవి సాకులు మాత్రమేనని చంద్రబాబు తలచుకుంటే నిర్వహణ కష్టం కాదని అంటున్నారు. ఓటమి భయంతోనే మహానాడు నిర్వహించే మూడ్ టీడీపీలో కనిపించడం లేదని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: