మంత్రి నారాయణకు ఫలితం ముందే తెలిసిపోయినట్లుంది చూడబోతే. మొన్నటి ఎన్నికల్లో  నెల్లూరు సిటి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. వైసిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ అనీల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. అదే విషయాన్ని మంత్రి మీడియాతో మాట్లాడుతూ తన ప్రత్యర్ధి చాలా బలవంతుడని అంగీకరించారు.

 

తన ప్రత్యర్ధి ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడని అనీల్ కు మంత్రి కితాబు కూడా ఇచ్చారు. తన ప్రత్యర్ధి చాలా బలవంతుడని తెలిసీ ఎదుర్కోవటానికి సిద్ధపడినట్లు మంత్రి చెప్పటం గమనార్హం. నిజానికి జనబలంలో అనీల్ ముందు నారాయణ ఏమాత్రం సరిపోరు. కానీ అంగ, అర్ధబలం ముందు నారాయణ ముందు అనిల్ సరితూగలేరు. అందులోను అధికారంలో ఉన్నారు కదా ఇక చెప్పేదేం ఉంది ?

 

మొన్నటి ఎన్నికల్లో గెలిచే ఉద్దేశ్యంతోనే నారాయణ చాలా ప్లాన్డ్ గా వ్యవహరించారు. పేదల ఇళ్ళ నిర్మాణంలో భాగంగా దాదాపు 10 వేల ఇళ్ళను తన నియోజకవర్గంలోనే నిర్మించుకున్నారు. ఎంత అభివృద్ధి చేసినా, ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఫలితం తనకు వ్యతిరేకంగా వస్తోందని మంత్రికి అర్ధమైపోయినట్లుంది.

 

నిజానికి గెలుపు లక్ష్యంతో నారాయణ డబ్బులు బాగానే ఖర్చు చేశారు. కానీ ఖర్చు చేద్దామని అనుకున్న డబ్బంతా ఓటర్లకు చేరలేదని గుర్తించారట. ఎవరినైతే నమ్మి డబ్బు పంపిణీ బాధ్యతలు అప్పగించారో వారే మోసం చేశారని నారాయణ గ్రహించారని సమాచారం. సరే ప్రభుత్వ వ్యతిరేకత అన్నింటికీ బోనస్ గా పనిచేసిందనుకోండి అది వేరే సంగతి. సో మొత్తం మీద రాబోయే ఫలితం ఎలా ఉండబోతోందో మంత్రికి ముందే తెలిసోపోయినట్లే ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: