నువ్వే నా సర్వస్వం అన్నాడు. నువ్వు లేనిదే నా జీవితం లేదని నమ్మబలికాడు. ప్రేమిచానన్నాడు. ఐ లవ్ యూ ప్లీజ్ ఒప్పుకో ప్రియతమా అంటూ వెంటబడ్డాడు. ఆ యువతి ఒప్పుకునే వరకు వదల్లేదు. ఇంకేముంది అతడి తీరును చూసి వావ్ ఇంత ఘనం నా మీద ప్రేమ ఉందంటూ ఎగేసుకొని తన ప్రేమకు ఓకే చెప్పింది యువతి.
అలా ఆ రోజునుంచి వారిద్దరు చెట్టపట్టాలేసుకుని తిరిగారు. శారిరకంగా దగ్గరయ్యారు. ఎంజాయ్ చేశారు. అంత వరకు బాగానే ఉంది. అక్కడే సీన్ కట్ చేస్తే.. ఆ యువతి గర్భం దాల్చింది. పెళ్లి విషయం అడిగే సరికి చేతులెత్తేశాడు ప్రేమికుడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వరంగల్ రూరల్ జిల్లా పర్వత గిరి మండలంలో సద్దాం అనే యువకుడు అదే మండలాలనికి చెందిన అప్సర అనే యువతిని ప్రేమించాడు. కొన్నాళ్ల పాటు వీరి ప్రేమాయనం సాఫీగానే సాగింది. సడన్గా వారి ప్రేమాయనానికి బ్రేక్ పడింది. తనను మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని బాధిత యువతి వాపోయింది. తాను గర్బం దాల్చడంతో.. తనకు సంబంధం లేంటూ ఆ యువకుడు తప్పించుకు తిరుగుతున్నాడు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి సద్దాం ఇంటి ముందు నిరసనకు దిగింది. తనను ప్రేమపేరుతో మోసం చేశాడని.. మాయమాటలు చెప్పి.. గర్బవతిని చేశాడంటూ బాధితురాలు వాపోయింది. ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక సర్పంచ్ ఆమెకు మద్దతుగా నిలిచారు.
మరోవైపు సద్దాం మాట మార్చాడు. ఆ యువతిని ఇష్టపడ్డానని చెప్పిన సద్దాం.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నాడు. పైగా సద్దాం చేసిందంతా చేసి తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బాధితురాలిపై ఆరోపణలు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పారు.