ప్రముఖ ఈ కామ‌ర్స్ సంస్థ, డిజిట‌ల్ వాలెట్ మాల్ పేటీఎం.. ఈ యాప్ అంటే తెలియ‌ని వారంటూ ఎవ‌రు ఉండ‌రు. తాజాగా పేటీఎం మాల్‌లో భారీ మోసం చోటుచేసుకుంది. ఈమేర‌కు పేటీఎంలో భార‌గా మోసం జ‌రిగిన‌ట్లు ఆ సంస్థ అధికారులు గుర్తించారు.

క్యాష్ బ్యాక్ రూపంలో రూ.5 నుంచి రూ . 10 కోట్ల వ‌ర‌కు మోసం జ‌రిగిన‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది.గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ ఈవైతో కలిసి రూపొందించిన ఒక ప్రత్యేక టూల్‌తో ఇంత పెద్ద‌భారీ మోసాన్ని గుర్తించిన‌ట్లు ఆ కంపెనీ అధికార ప్ర‌తినిధి  తెలిపారు. 


కంపెనీ లోతైన త‌నిఖీలు చేయ‌గా ఇంత పెడ్డ భారీ మోసం గుర్తించి విచార‌ణ చేప‌ట్టారు. విచార‌ణ‌లో భాగంగా కొంద‌రు చిరు వ‌ర్త‌కుల‌కు భారీగా క్యాష్ బ్యాక్ ల‌భిస్తున్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లు పేటీఎం వ్య‌వ‌స్థాప‌కుడు విజ‌య్ వేఖ‌ర్ శ‌ర్మ తెలిపారు. దీనిపై చాలా డీప్‌గా విచార‌ణ చేప‌ట్ట‌డంతో రూ.10 కోట్ల మోసం బ‌య‌ట‌ప‌డిన‌ట్లు వెల్లడించారు. 


అయితే పేటీఎం కంపెనీలో కొంద‌రు కిందిస్థాయి ఉద్యోగులు వారికి స‌హ‌క‌రించిన‌ట్లు గుర్తించామ‌న్నారు. ఫేక్ ఆర్డ‌ర్లు సృష్టించింది క్యాష్ బ్యాక్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బును త‌మ సొంత ఎకౌంట్లో మ‌ళ్లించుకున్న‌ట్లు విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ తెలిపారు. 


ఈ నేప‌థ్యంలో దాదాపు 100 మందికి పైగా వెండ‌ర్ల‌ను త‌మ ప్లాట్ ఫామ్ నుంచి తొల‌గించామ‌ని, కొంద‌రు ఉద్యోగుల‌ను కూడా తొలగిచిన‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. ఇక‌పై ఫ్యూచ‌ర్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా మ‌రిన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: