తెలంగాణాలో కొన్ని పార్లమెంట్ స్థానాల్లో తన అభ్యర్ధులను నిలిపిన బిజెపి కొన్ని స్థానాలను గెలుచుకోబోతుందని హుషారుగా ఉన్నారు. వాటిలో సికిందరాబాద్ మహబూబ్-నగర్, కరీం-నగర్, నిజామాబాద్ తదితర స్థానాల్లో గెలవగలదని బలమైన నమ్మకంతో ఉన్నారు. 

Image result for kishan reddy DK aruna

తెలంగాణ విధానసభ ఎన్నికల్లో అత్యంత ఘోరపరాభవం తర్వాత లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. టీఆర్ఎస్‌కి ఓటమి రుచిచూపించటమే  లక్ష్యం గా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి, బీజేపీ అగ్రనేతలతో సైతం ప్రచారం నిర్వహించింది. మొత్తం 17 స్థానాల్లో నాలుగైదు ప్రధాన స్థానాలపై భారీ ఆశలు పెట్టుకుంది కమలం. అయితే తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్, మహబూబ్-నగర్ లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచు కోవటం తధ్యమని జోస్యం చెప్పారు.
Image result for yeddyurappa visits Vikarabad
కేంద్రంలో మరోసారి బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు యడ్యూరప్ప. బీజేపీ 280 సీట్లు సాధించి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పీఠం అదిష్టించ బోతున్నారని చెప్పారు. కర్నాటకలో బీజేపీకి 20-22 ఎంపీ స్థానాలలో విజయం సాధించటం ఖాయమన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో పర్యటించిన యడ్యూరప్ప, "భావిగి భద్రేశ్వర స్వామి ఆలయం" లో పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో త్వరలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోనుందని అందులో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని స్పష్టంగా చెప్పారు. చేశారు.

తెలంగాణలో ఆ రెండు ఎంపీ సీట్లు బీజేపీవే...మాజీ సీఎం జోస్యం


మరింత సమాచారం తెలుసుకోండి: