రామోజీరావు రాజకీయాల్లొకి రాలేదు కానీ ఆయన చక్రం తిప్పడం మొదలుపెడితే జాతీయ ప్రాంతీయ రాజకీయాలు అన్నీ కూడా అలా ఆటూ ఇటూ మారుతూ వస్తాయి. ఇక ఇపుడు రామోజీరావు తన ఇంటికి అత్యవసరంగా చంద్రబాబుని రప్పించుకున్నారంటే దాని వెనక పెద్ద కధ చాలానే ఉంటుందన్నది అంతా వూహిస్తున్నారు. బీజేపీ తరఫున రామోజీ సందేశం ఏదో బాబుకు వినిపించడానికే ఈ భేటీ జరిగిందని అంటున్నారు.


చకచకా పరిణామాలు ఇపుడు దేశంలో మారిపోతున్నాయి. దేశంలో మోడీ మరో మారు అధికారంలోకి రావాలను భావిస్తున్నారు. ఆయనకు బాబుకు చెడిన తరువాతనే కాంగ్రెస్ కి కేంద్రంలో కాస్తా వూతం వచ్చిందని బీజేపీ వూహిస్తోంది. బాబు ఏం చేయగలరు అనుకున్నారు.  కానీ ఆయన పూలలో దారం లాంటి వారు అందరికీ కలపగలరు, ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అంటూ అన్ని చోట్లకు తిరిగి ఇగోలు పెట్టుకోకుండా మీటింగులు పెట్టగలరు, ఇది చాలు కదా బీజేపీకి ఇబ్బందులు పెట్టడానికి.


అందుకే ఇపుడు బీజేపీ నుంచి ఓ సందేశం రామోజీరావు ద్వారా బాబుకు వినిపించాలనుకుంటున్నారని టాక్. రేపటి రోజున బీజేపీకి బాబు మద్దతు ఇవ్వకపోయినా పరవాలేదు కానీ కాంగ్రెస్ ని బలోపేతం చేసే మీటింగులు,  నాయకులను కలిపే సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఉంటే అదే పదివేలు అనుకుంటున్నారుట. మరి దానికి ప్రతిఫలం బాబుకు అందుతుందని కూడా అంటున్నారు.


మొత్తానికి హఠాత్తుగా బాబు రామోజీరావుని కలవడం, దానికి ముందురోజు మంత్రులతో బీజేపీ వచ్చిన పరవాలేదు అంటూ బాబు మాట్లాడడం వెనక ఈ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా కేంద్రంలో  మరో మారు అధికారం కోసం బీజేపీ రామోజీని తెలుగు సాయం కోరుతున్నట్లుగా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ భేటీ తరువాత మరెన్ని పరిణామాలు సంభవిస్తాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: