ఎన్నికల సంఘం.. దేశంలోని స్వతంత్ర్య రాజ్యాంగ బద్ద సంస్థ. దీనికి ఉన్న అధికారాలు అపారం.. స్వేచ్చగా ఎన్నికలు జరిపించేందుకు ఎన్నో అధికారాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. ఎన్నికలు పూర్తయ్యేవరకూ దేశంలోని అధికార యంత్రాంగమంతటిపై ఈసీకి అజమాయిషీ ఉంటుంది. 


గతంలో టీఎన్ శేషన్.. ఈ అధికారాలను బాగా ఉపయోగించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈసీ తనకు ఉన్న ఓ గొప్ప అధికారాన్ని ఉపయోగించింది. బెంగాల్ హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ఒక రోజు ముందే నిలిపేసింది. ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించేసింది. 

చివరి విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం. అయితే హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో మాత్రం గురువారం రాత్రికే ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఇలాంటి ఉత్తర్వులివ్వడం భారత ఎన్నికల చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైమ్. 

బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్‌ జరగాల్సి ఉంది. కోల్‌కతాలో అమిత్‌ షా ర్యాలీ సందర్భంగా బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలను పరిశీలించిన ఈసీ తనకు ఉన్న విశేషాధికారాన్ని ఉపయోగించింది. బెంగాల్‌ హోం శాఖ ముఖ్య కార్యదర్శి అత్రి భట్టాచార్య, సీఐడీ అదనపు డీజీ రాజీవ్‌లను తొలగించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: