సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కిరాయి హంతకుల పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారా ? ఈ హత్యతో కుటుంబసభ్యల హస్తం ఉందనే అనుమానాలకు పోలీసుల చర్యలు కూడా ఊతమిస్తున్నాయి. వివేకా హత్యకు కుటుంబ సభ్యుల్లో కొందరు భారీ సుపారి ఇచ్చినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. అందుకు తగ్గ ఆధారాల సేకరణలో బిజీగా ఉన్నారు.

 

మొన్న మార్చి 15వ తేదీన తన ఇంట్లోనే తెల్లవారిజామున వివేక హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే.  హత్య విషయం వెలుగు చూడగానే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. సహజంగానే వివేకా హత్యపై ఇటు వైసిపి అటు టిడిపి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వివేకాను హత్య చేయించాల్సిన అవసరం టిడిపికే ఉందని అందులోను ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి హస్తముందని వైసిపి ముఖ్యులు బహిరంగంగానే ఆరోపించిన విషయం తెలిసిందే.

 

అదే సమయంలో సొంత బాబాయ్ వివేకాను వైఎస్ కుటుంబమే హత్య చేయించిందని చంద్రబాబునాయుడు అండ్ కో ఎదరుదాడి చేసిన విషయం అందరూ చూసిందే. మొత్తానికి హత్యలో ఎవరి ప్రమేయం ఉందో స్పష్టంగా తేలలేదు కానీ రెండు పార్టీల పరస్పర ఆరోపణలతో జనాల్లో బాగా అయోమయం మాత్రం పెరిగిపోయింది. అయితే, జిల్లాలో మాత్రం వివేకా హత్య వెనుక టిడిపి నేతల ప్రమేయం ఉందని జనాలు బాగా నమ్మతున్నారట.

 

ఈ నేపధ్యంలోనే వివేకా హత్యకు కుటుంబసభ్యులే భారీ సుపారి ఇచ్చారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు చంద్రబాబు మీడియా చెప్పింది. బెంగుళూరుకు చెందిన కిరాయి హంతకులను రంగంలోకి దింపి మరీ హత్య చేయించిందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సదరు మీడియా చెప్పింది. విచారణలో కుటుంబసభ్యులు సహకరించకపోవటంతో వాళ్ళ కాల్ డేటాను తెప్పించి విశ్లేషిస్తోందట.  మరి ఈనెల 23వ తేదీలోగా హత్యకు కారకులెవరో తేల్చేస్తారో లేదో మాత్రం చెప్పలేదు.
===========================

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: