స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన పార్టీలకు ఉత్తర భారతమే అండగా నిలుస్తూ వచ్చింది. ఉత్తర భారతానికి చెందిన వారే ఎక్కువశాతం ప్రధాన మంత్రులుగా కొనసాగారు. అటు గాంధీ ఫ్యామిలీ నుంచి ఇటు బీజేపీ నేతల వరకూ అంతా ఉత్తరాదివారే. మధ్యలో ఒకటిరెండు సార్లు మాత్రమే దక్షిణాదికి అవకాశం దక్కింది. 


మన తెలంగాణ బిడ్డ బహుముఖ ప్రఙ్జావంతుడు, సరళీకృత ఆర్ధిక విధాన రూపశిల్పి, పీవీ నరసింహారావు ప్రధానిగా సత్తా చాటారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేయించారు.
Image result for karnataka political party symbols
అయితే ఎంతో సత్తా ఉన్నప్పటికీ దక్షిణాది వారు దేశాన్ని ఏలకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడి ప్రాంతీయ పార్టీలే. తమిళ నాడు ఆంధ్రా తెలంగాణ కర్ణాటక కేరళలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకు అడ్రస్ గల్లంతైంది. అందుకే ఉత్తరాది బలంపైనే అవి నెగ్గి అక్కడివారినే ప్రధానులుగా నిర్ణయిస్తూ ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఇప్పుడు 2019 ఎన్నికల వేళ కాలం తెచ్చిన మార్పు కేంద్రంలోని బీజేపీకి  ‘హిందీ బెల్ట్’ ల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.  కుచించుకుపోయిన కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని బీజేపీ నుంచి లాగేసుకుంది. 
Image result for trs car symbols
ఉత్తర భారతం మొత్తం కాంగ్రెస్ బీజేపీలు చెరిసగం సీట్లు పంచుకొని హంగ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల వేళ దక్షిణాది పార్టీలే కీలకం గా  మారాయి. భావి ప్రధానిని నిర్ణయించడంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయడంలో ప్రాంతీయ పార్టీలే కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణాదిన ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులను బట్టి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలకంగా మారనున్నారని తెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ హవా ఉండనే ఉంది. తమిళనాట డీఎంకే అన్నా డీఎంకే కేరళలో కమ్యూనిస్టులు కర్ణాటకలో జేడీఎస్ ఆధిపత్యం ఉంది. 
Image result for south indian political parties
ఒక్క కర్ణాటకలో తప్పితే జాతీయ పార్టీల ఉనికి నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో లేదు. ఈ నేపథ్యంలో హంగ్ కనుక వస్తే దేశంలో దక్షిణాది పార్టీలదే కీలక రాజకీయ పాత్ర.  అందుకే కాంగ్రెస్ బీజేపీ జాతీయ నేతల నుంచి జాతీయ మీడియా దాకా ఇప్పుడు దృష్టి అంతా దక్షిణాది వైపే మళ్లింది. దక్షిణాది పార్టీల మద్దతు ఎటు అనేదానిపై చర్చోపచర్చలు చేస్తున్నాయి. ఈసారి ఉత్తరాది కంటే కూడా దక్షిణాది పైనే అందరి దృష్టి నెలకొంది.  
Image result for TDP Flag YCP Flag
అందుకే జాతీయ రాజ‌కీయాల రూపురేఖలు మారిపోయాయి. ఇప్ప‌టిదాకా ఉత్త‌రాది గాలి ఎటు వీస్తే, కేంద్రంలో ఆ పార్టీదే అధికారంగా వ్య‌వ‌హారం న‌డిచింది. అయితే ఇప్పుడ‌లా కాదు. ద‌క్షిణాది ఎటు వైపు మొగ్గితే వారిదే అధికారం అన్న రీతిగా ప‌రిస్థితి మారిపోయింది.  గ‌డ‌చిన ఎన్నిల్లో  ఈ త‌ర‌హా ప‌రిస్థితి లేద‌నే చెప్పాలి. ఈ సారి ఉన్న‌ప‌ళంగా ప‌రిస్థితి అంతా మారి పోయింది. పైన వివరించినట్లు ద‌క్షిణాదిపై జాతీయ పార్టీల‌కు పెద్ద‌గా ప‌ట్టు లేద‌నే చెప్పాలి. ఆయితే ఇక్కద ప్రాంతీయల హవా మాత్రం అంతా ఇంతాకాదు.  
Image result for anna DMK DMK flags
కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తెలుగు నేల‌పై పట్తు కలిగి ఉండేది కాని ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. అదే స‌మ‌యంలో అప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి చేరుకున్న టీడీపీకి కూడా ప్రస్తుతం తన స్థాయి కోల్పోతూ ఆ స్థాయికి టీఆర్ఎస్‌, వైసీపీలు చేరుకున్నాయని అంటున్నాయి. అవికూడా ప్రాంతీయ పార్టీలేకదా!  ఇక త‌మిళ‌నాడు ప‌రిస్థితి చెప్పాల్సి న ప‌నే లేదు. కేర‌ళ‌లో కూడా ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీకి కూడా కాలు మోపే అవ‌కాశం ఇప్ప‌టి దాకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి.  అదే స‌మ‌యంలో ఉత్త‌రాది లో స్ప‌ష్ట‌మైన మెజారిటీ సాధించే అవ‌కాశాలు లేకున్న నేప‌థ్యంలో ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ కూడా ద‌క్షిణాది వైపు దృష్టి సారించ‌ లేద‌నే చెప్పాలి. 
Related image
అయితే ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉత్త‌రాదిలో చెరి స‌గం సీట్లు పంచుకునే స్థితికి కాంగ్రెస్‌, బీజేపీలు చేర‌డం తో ద‌క్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు సాధించే సీట్టే కేంద్రంలో అధికారాన్ని శాసించ‌నున్నాయి. నేరుగా ద‌క్షిణాదికి చెందిన నేత‌ల‌కు ప్ర‌ధాని అవ‌కాశం ద‌క్క‌కున్నా, ఇప్పుడు ద‌క్షిణాదిలోని ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు లేకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవ‌కాశాలే క‌నిపించ‌డం లేదు  మొత్తంగా ఇప్పుడు ద‌క్షిణాది పార్టీల మ‌ద్ద‌తు ఉత్త‌రాది పార్టీలుగా ముద్రప‌డిన జాతీయ పార్టీల‌కు కావాల్సి వ‌చ్చింద‌ని చెప్పాలి. ఇదే పంథా మున్ముందు కూడా కొన‌సాగడం కూడా ఖాయంగానే క‌నిపిస్తోంది.  ఇప్ప‌టిదాకా జాతీయ రాజ‌కీయాల‌ను ఉత్త‌రాది భార‌తం శాసిస్తే, ఇక‌పై ద‌క్షిణాది భారతం దేశ రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషించ‌నుంద‌న్న మాట‌. 
 Image result for udf kerala symbol

మరింత సమాచారం తెలుసుకోండి: