దేశ వ్యాప్తంగా మ‌హిళ‌లు, బాలికలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు అడ్డులేకుండా పోయింది. నిత్యం ఏదో ఒక చోట అమ్మాయిల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొచ్చినా. ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావ‌డం లేదు. దీంతో వారిపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హాలు.. ఆవేశాలు.. వెల్లువెత్తుతున్నాయి. 


ఈ నేప‌థ్యంలో తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే రాజ‌స్థాన్‌లో చోటు చేసుకుంది. ఓ బాలిక‌పై ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. దీంతో ఆ ముగ్గురు బాలురును ప‌ట్టుకునే దేహ‌శుద్ది చేశారు స్థానికులు. రాళ్ల‌తో కొట్ట‌డంతో ఒక నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు స్థానికులు. పోలీసులు వారిని జువైన‌ల్ హోమ్‌కు త‌ర‌లించారు. 


రాజస్తాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఇందులో ఆళ్వార్‌ జిల్లాలో ద‌ళిత మహిల‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. తాజాగా అదే జిల్లాలో ఓగ్రామానికి చెందిన బాలిక ఈనెల 14 త తేదీన బంధువుల ఇంట్లో జ‌రిగిన వివాహానికి వెళ్లింది.


అయితే అక్క‌డ ముగ్గురు బాలురు ఆమెను ఎత్తుకెళ్లారు. సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ విష‌యం తెలిసిన‌ బాధితురాలి బంధువులు నిందితులను ప‌ట్టుకుని దేహ‌శుద్ది చేశారు. వారిపై రాళ్ల‌తో దాడి చేశారు. ఈ దాడితో ఒకరు మరుసటి రోజు రోడ్డు పక్క శవమై కనిపించాడు.


కాగా.. మిగిలిన ఇద్ద‌రిని కోర్టు ఆదేశాల మేరకు జువెనైల్‌ హోంకు తరలించినట్లు ఎస్పీ అనిల్‌ తెలిపారు. ఈ నెల 17న చురు ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై బంధువైన 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో  బాధితురాలి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేర‌కు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


అదేవిధంగా ఈ నెల 16 న ధోల్‌పూర్‌లో ఎనిమిదేళ్ల బాలిక‌పై ఓ యువ‌కుడుడ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అత‌డిని విచారించారు. ఇలా ఉంటే మ‌రోవైపు  ఏప్రిల్‌ 26వ తేదీన ఆళ్వార్‌లో దళిత మహిళపై గ్యాంగ్‌ రేప్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖ‌లు చేశారు. 


దీనిపై ఎన్ని చ‌ట్టాలు, చ‌ర్య‌లు తీసుకున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావ‌డం లేదు. కాలం గ‌డుస్తూనే ఉంది.. ప్ర‌భుత్వాలు మారుతూనే ఉన్నాయి.. కొత్త కొత్త చ‌ట్టాలు వ‌స్తూనే ఉన్నాయి.. క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటూనే ఉన్నారు.. కానీ ఫ‌లితం మాత్రం క‌నిపించ‌డం లేదు.. ప్ర‌తి రోజు ఏదో ఒక చోట ఒక మ‌హిళ‌పై, అమ్మాయిల‌పై దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. దీనిపై అటు పోలీస్ శాఖ కానీ.. ఇప్పుడొచ్చే కొత్త ప్ర‌భుత్వాలు గానీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాయో వేచి చూడాలి... 


మరింత సమాచారం తెలుసుకోండి: