అమెరికాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మెరీలాండ్ రాష్ట్రంలో అరియానా ఫ్యూన్స్‌-డియాజ్ అనే 14 ఏళ్ల అమ్మాయి దారుణ హ‌త్యకు గురైంది. 15మందితో కూడిన గుంపు ఆమెను దారుణంగా హ‌త్య చేశారు. ఎస్కోబార్‌, ఫ్యూంటెస్‌ పోన్స్ అనే ఇద్ద‌రు టీనేజ‌ర్లు ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. దీంతో ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. మ‌రోకరు ప‌రారీలో ఉన్నాడు.


కాగా.. గ‌త ఏప్రిల్ 11న అరియానా ఫ్యూన్స్‌-డియాజ్ తాను ఉంటున్న యూత్ గ్రూప్ హోం నుంచి పారిపోయింది. మ‌రుస‌టి రోజు ఏప్రిల్ 17న త‌ను ఇంటికి వెళ్ల‌డం కోసం ఓ వ్య‌క్తిని క‌లిసింది. అయితే ఆ వ్య‌క్తి త‌న త‌ల్లికి ప‌రిచ‌య‌స్తుడు కావడంతో అత‌డిని క‌లిసిన అరియానా.. త‌న‌ను బెన్నింగ్‌ మెట్రో స్టేషన్‌లో దిగ‌బెట్టాల్సిందిగా కోరింది. 


ఇక వారు బ‌య‌ల్దేరిన క్ర‌మంలో వారు ప్ర‌యాణిస్తున్న కారును 15 మంది స‌భ్యుల‌తో ఉన్న ఒక గుంపు అడ్డుకుంది. అరియానా వెంట ఉన్న వ్య‌క్తిని బ‌య‌ట‌కు ఈడ్చి పారేశారు ఆ గుంపు. ఆ త‌ర్వాత అత‌డిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. చిత్ర హింస‌లు పెట్టారు. తీవ్రంగా ఇష్ట‌మొచ్చిన‌ట్లు కొట్టారు. అంతే కాదు.. అరియానాతో వ‌చ్చిన వ్య‌క్తిని అర్ధనగ్నంగా నిల్చోబెట్టి మ‌రి హింసించి పైశాచిక ఆనందం పొందారు. 


అనంత‌రం.. అత‌డి వ‌ద్ద నుంచి 500 డాలర్లు, ఏటీఎమ్‌ కార్డులు లాక్కున్నారు. స‌రిగా ఆ టైమ్‌లోనే అక్క‌డ‌కు చేరుకున్న అరియానా ఆ వ్య‌క్తిని కొట్టొద్దంటూ బ‌తిమాలింది. దీంతో ఆ వ్య‌క్తిని వ‌దిలిపెట్టారు. ఇక ఆ గ్యాంగ్ తో ఆ వ్య‌క్తిని కిడ్నాప్ చేయించాల‌ని అనుకున్నఅరియానాపై ఆ గ్యాంగ్‌కు రావ‌ల్సిన అనుమానం కాస్త రానే వ‌చ్చింది. 


ఆ గ్యాంగ్ చేసిన రాబ‌రీ గురించి.. ఆ వ్య‌క్తిని కొట్టిన సంగ‌తి గురించిగానీ వారి గురించి పోలీసుల‌కు చెబుతుందోన‌న్న అనుమానం ఆ గ్యాంగ్‌కు వెంటాడింది. ఇక అరియానాతో త‌మ‌కు ఎప్ప‌టికైనా ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని భావించిన ఆ గ్యాంగ్ ఆమెను చంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఆ మ‌రుస‌టి రోజు అంటే ఏప్రిల్ 18న అరియానాకు మాయ‌మాట‌లు చెప్పి జ‌నాలు లేని ఓ అపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లారు. అనంత‌రం అక్క‌డే ఉన్న ట‌న్నెల్‌లోకి అరియానాను లాక్కెళ్లారు. ఆమెను పాశ‌వికంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల‌ను అరెస్ట్ చేశారు. 


ఎస్కోబార్‌, ఫ్యూంటెస్‌ పోన్స్‌ అనే టీనేజర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. అరియానాను వివస్త్రగా మార్చిన ఎస్కోబార్‌.. స్పోర్ట్స్ క‌ర్ర‌ల‌తో ఆమె త‌ల‌పై బ‌లంగా కొట్టిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతే కాదు.. ఫ్యూంటెస్ క‌త్తితో ఆమెను దారుణంగా గాయ‌రిచాడు. ఇక అక్క‌డ జ‌రుగుతున్న దారుణాన్ని అక్క‌డ‌కు వ‌చ్చిన మ‌రో వ్య‌క్తి వీడియో తీస్తూ రాక్ష‌సానందం పొందాడు. కఅయితే.. ఈ ఘ‌ట‌న‌లో వీరికి హెర్నాండెజ్‌ అనే మరో పద్నాగేళ్ల బాలిక సహకరించింది.


విచారణలో భాగంగా అరియానా హత్యలో తనకు భాగం లేదన్న హెన్నాండెజ్‌.. ఆరోజు తను టన్నెల్‌ బయట నిల్చుని ఉన్నానని పేర్కొంది. ఆ టైమ్‌లో మ‌హిళ అరుపులు వినిపించిన కొద్ది సేప‌టికే ఎస్కోబార్‌, ఫ్యూంటెన్స్‌ బయటికి వచ్చారని చెప్పింది. అప్పుడు వారి ముఖం, బట్టలు పూర్తిగా రక్తంతో తడిచిపోవడంతో తనకు భయం వేసిందని పేర్కొంది. 


అయితే ఉద్దేశ పూర్వకంగానే హెర్నాండెజ్‌ టన్నెల్‌ బయట నిల్చుని హంతకులకు సహకరించిందని పోలీసులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా సమీపంలో దొరికిన కత్తి, అపార్టుమెంటులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించగలిగామని పోలీసులు తెలిపారు.  అయితే ఈ హత్యలో పాత్రుడైన మరో నిందితుడు ప‌రారీలో ఉన్నాడ‌ని.. త్వ‌ర‌లోనే ఆ నిందితుడిని కూడా ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: