ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో మూడు రోజుల్లో వెలువ‌డ‌నున్నాయి. ఇక ఆదివారం సాయంత్రం వెలువ‌డిన ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాల్లో ఒక్క ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ ఆర్జీప్లాష్ స‌ర్వే మిన‌హా మిగిలిన స‌ర్వేలు అన్ని ఏపీలో వైసీపీ ప్ర‌భంజనం క్రియేట్ చేయ‌బోతోంద‌ని స్ప‌ష్టం చేశాయి. ఈ  ఎన్నికల్లో వైసీపీ అపూర్వ విజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మెజార్టీ స‌ర్వేలు వైసీపీకి 100కు పైగా స్థానాలు దక్కించుకోనుందని ప్రధాన సంస్థల లెక్కలు చెబుతున్నాయి.


ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వేలోనూ వైసీపీ జోరు ముందు టీడీపీ బేజారు అయ్యింది. ఏపీలో వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఈ సారి తిరుగులేకుండా పోయింద‌ని... ఆయ‌న నేతృత్వంలోని వైసీపీకి ఏకంగా 132-135 సీట్లు వ‌స్తున్న‌ట్టు ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది. 


మిష‌న్ చాణ‌క్య స‌ర్వే ప్ర‌కారం ఏపీలో వైసీపీ 98 అసెంబ్లీ స్థానాలు సాధించ‌నుంది. ఇక టీడీపీకి 58 సీట్లు, జ‌న‌సేన‌కు 7 సీట్లు ద‌క్క‌నున్నాయి. ఇక ఇదే సంస్థ ఎంపీ సీట్ల విష‌యానికి వ‌స్తే వైసీపీకి 15, టీడీపీకి 8 సీట్లు, ఇత‌రుల‌కు 1-2 వ‌చ్చే ఛాన్సులు ఉన్న‌ట్టు చెప్పింది. అలాగే ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ స‌ర్వేలో వైసీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 సీట్లు రానున్నాయి. సీపీఎస్ స‌ర్వే అంచ‌నా ప్ర‌కారం వైసీపీకి 133-135 స్థానాలు, అధికార టీడీపీ కేవ‌లం 37-40 సీట్లు సాధించ‌నుంది. ఏపీలో స‌ర్వే ఏదైనా వైసీపీ ప్ర‌భంజ‌న‌మే ఉన్న‌ట్టు చెపుతోంది. ఇక ఫ‌లితాల కోసం వైసీపీ వాళ్లు వెయిట్ చేయ‌డ‌మే మిగిలి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: