ఎగ్జిట్ పోల్స్.. ఎన్నికల ఫలితాల వరకూ ఆగలేని జనం ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ప్రారంభమైన ట్రెండ్ ఇది. ఓటేసి వచ్చే వారిని ప్రశ్నించి చెప్పిన అంచనాలు ఇవి.. కానీ వీటిని ప్రసారం చేయడంలో ఆంధ్రప్రదేశ్ లోని మీడియా హౌజులు చేసిన విన్యాసాలు చెప్పనలవి కాదు. 


ఒక్కో సంస్థ ఒక్మోలా ఫలితాలు వెలువరిస్తాయి.ఇది సహజమే. కానీ మీడియా అన్నాక అన్నీ ప్రసారం చేయాలి.. కానీ ఈసారి చిత్రంగా పసుపు ఛానళ్లుగాపేరుబడిన టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబు గెలుస్తాడని చెప్పిన సర్వే వివరాలే చూపించారు. 

అటు వైసీపీ మీడియాగా పేరుపడిన ఒకటి, రెండు ఛానల్లు పూర్తిగా జగన్ అనుకూల సర్వేలనే ప్రజలకు చేరవేశాయి. ఎవరైన తటస్థ ఓటరు.. అసలు ఎగ్దిట్ పోల్స్ ఏం చెప్పాయో తెలుసుకోవాలని నాలుగు రకాల ఛానళ్లు మారిస్తే నాలుగు రకాలుగా వార్తలు వస్తున్న దుస్థితి నెలకొంది. 

ఓవరాల్ గా చూస్తే.. వైసీపీ గెలుస్తుందని చెప్పిన సర్వేలే ఎక్కువ. కానీ టీడీపీ గెలుస్తుందని కూడా కొన్ని సర్వేలు చెప్పాయి. పాపం ఆ విషయం చంద్రబాబు ఊహించలేదేమో.. ఎగ్జిట్ పోల్స్ ను అస్సలు నమ్మొద్దంటూ ముందే ఓ పిలుపు ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: