జనసేన.. ఇప్పుడు ఏపీలో ఇదే కింగ్ మేకర్.. ఎవరినైనా ఓడించాలన్నా.. ఇంకెవరినైనా గెలిపించాలన్నా అది జనసేనతోనే సాధ్యం అన్నట్టుంది నేడు పరిస్థితి. మరి మొన్నటి ఎన్నికల్లో జనసేనతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. అన్న అంశంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ ఛానల్లో మాట్లాడుతూ తన విశ్లేషణ అందించారు. 

ఆయన ఏమన్నారంటే..

చాలామంది ప్రభుత్వ వ్యతిరేకత ఓటను దారి మళ్లించడానికి చంద్రబాబు  పవన్ కల్యాణ్ ను ప్రయోగించాడని.. ఓ అవగాహన కుదుర్చుకున్నాడని అంటారు. అటు పవన్ కూడా ఈ ఎన్నికల్లో చంద్రబాబుపై కాకుండా జగన్ పై  ఫోకస్ ఎక్కువ పెట్టారు. 


అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారికే పడుతుంది. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది జగనే తప్ప పవన్ కాదు..కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది జనసేనకు పడే అవకాశాలు చాలా తక్కువ. 

ఇంకో కీలక విషయం ఏంటంటే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు ఉన్న ఓటు బ్యాంకు కనీసం 10 నుంచి 15 శాతం ఉండొచ్చని లగడపాటే చెబుతున్నాడు. గతంలో ఈ ఓటు బ్యాంకు మొత్తం టీడీపీకి పడిందే.. ఈ ఓటు బ్యాంకు కోల్పోవడం ద్వారా చంద్రబాబు చాలా నష్టపడుతున్నాడు. కాబట్టి పవన్ కల్యాణ్ కారణంగా టీడీపీకి వచ్చే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ. 



మరింత సమాచారం తెలుసుకోండి: