ధోనీ.. ఇండియాకు మరోసారి ప్రపంచ కప్ తెచ్చిన క్రికెట్ వీరుడు. ఇండియన్ కెప్టెన్లలో సక్సస్ ఫుల్ హీరో.. సుదీర్ఘకాలంపాటు టీమిండియాకు సేవలు అందించిన వాడు. ఇక త్వరలో తాను రిటైర్ అవ్వడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. 


మరి రిటైర్ అయ్యాక ధోనీ ఏంచేస్తాడు.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేందుకే అన్నట్టు ధోనీ ఓ వీడియో విడుదల చేశాడు.. అందులో తనలో ఉన్న మరో టాలెంట్ ను ధోనీ బయటపెట్టాడు. అదేంటో తెలుసా.. ధోనీ మంచి ఆర్టిస్ట్ కూడా. 


ఆ వీడియోలో తాను స్వయంగా గీసిన పెయింటింగ్స్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. మీ అందరికీ తెలియని ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. అంటూ తన అనుభూతులు పంచుకున్నాడు. తాను పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే ఒక కళాకారుడిని కావాలనుకున్నాడట. 


ఇంకా ఏమన్నాడంటే... ఇప్పటికే క్రికెట్‌ ఆడాను. ఇప్పుడు నా కల సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను గీసిన కొన్ని పెయింటింగ్స్‌ మీ ముందుకు తెచ్చాను అంటూ వివరించాడు ధోనీ. ఆయన చూపించిన మూడు పెయింటింగ్స్‌ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో.. రిటైర్ అయ్యాక ధోనీ మంచి ఆర్టిస్ట్ అవుతాడేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: