వైఎస్ జగన్ ఈ రోజు అమరావతి వస్తున్నారు. అక్కడ తాడేపల్లిలో తన అభిరుచికి తగినట్లుగా కట్టించుకున్న నూతన గ్రుహంలోకి జగన్ చాన్నాళ్ళ తరువాత వస్తున్నారు. ఆయన అక్కడ నుంచే కౌంటింగ్ సరళిని గమనిస్తారు. పార్టీ నాయకులతో సమావేశమై ఎప్పటికపుడు సలహాలు, సూచనలు అందచేస్తారు.


ఇక అన్ని ఎగ్టిట్ పోల్స్ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు కూడా జగన్ సీఎం అని ఇప్పటికే ప్రకటించేసాయి. అదే సమయంలో ఏపీలో రాజకీయ వేడి కూడా అలాగే ఉంది. ఇక కౌంటింగ్ కు ముందు వైసీపీ అధ్యక్షుడిగా అమరావతి వచ్చిన జగన్, కౌంటింగ్ తరువాత సీఎం హోదాలో ఇడుపులపాయ వెళ్తారని అంటున్నారు.


ఆయన గెలిచిన ఎమ్మెల్యేలందరినీ తీసుకుని ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద ఘన నివాళి అర్పిస్తారు. అనంతరం ఆయన అక్కడే పార్టీ నాయకులతో మీటింగ్ పెడతారని చెబుతున్నారు. ఇక అక్కడే వైసీపీ శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకుంటారని తెలుస్తోంది.  ఇవన్నీ ఇలా ఉంచితే విశాఖకు చెందిన శ్రీ స్వరూపానందేంద్ర మహా సరస్వతి స్వామి వారు ఈ నెల 30న జగన్ కోసం మంచి ముహూర్తాని రెడీ చేసి ఉంఛారు. 


ఆ రోజున జగన్ సీఎం గా ప్రమాణం చేస్తారని అంటున్నారు. అదే విధంగా జగన్ సీఎం గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జాతీయ పార్టీలకు చెందిన నాయకులను కూడా పిలుస్తారని తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే జగన్ వైసీపీ అధినేతగా అమరావతి వస్తారని, తిరిగి వెళ్ళేది మాత్రం సీఎం గానే అని వైసీపీ శ్రేణులు అపుడే సంబరం చేసుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: