ఏపీ ఎన్నికల తర్వాత ఏపీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేశ్ పెద్దగా మాట్లాడటం లేదు. వెయ్యి శాతం మేం గెలుస్తామని చంద్రబాబు రోజూ చెబుతున్నారు కానీ ఎక్కడా లోకేశ్ మాత్రం మీడియా ముందుకు రావడం లేదు.


కనీసం ట్విట్టర్ ఖాతాలోనైనా మాదే గెలుపు అని స్పందించడం లేదు. ఇది కచ్చితంగా టీడీపీ ఓటమికి సంకేతమంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఒకవేళ టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే.. కచ్చితంగా ఆ విజయాన్ని లోకేశ్ కు ఆపాదించే ప్రయత్నాలు ఇప్పటికే జరిగి ఉండేవని ఆయన అంటున్నారు.


ఈసారి అలాంటి ప్రయత్నాలేమీ జరగలేదు కాబట్టి టీడీపీకి గెలుపుపై ఏమాత్రం విశ్వాసం లేదని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా పాత ఎన్నికలను ఆయన గుర్తు చేస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో మహా కూటమి గెలుస్తుందన్న అంచనాలు ఉండేవి. 


ఆ సమయంలో లోకేశ్‌ ను బాగా ప్రమోట్ చేశారు. అప్పట్లో టీడీపీ కూటమి  నగదు బదిలీ హామీ ఇచ్చింది. ఈ ఐడియా లోకేశ్ మానస పుత్రికగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. కానీ ఇప్పుడు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదని నాగేశ్వర్ గుర్తు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: