వైసీపీ అధినేత జగన్ రేపటి ఎన్నికల ఫలితాల తరువాత తనదైన రాజకీయాన్ని చూపిస్తారని అంటున్నారు. ఇప్పటివరకూ ఆయన జాతీయ రాజకీయాలపై ద్రుష్టి పెట్టలేదు. ముందు ఫలితాలు రావాలి అంటున్నారు. ఎటూ ఏపీలో జగన్ కి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు వస్తాయని తెలుస్తోంది. దాంతో ఇపుడు జగన్ చూపు ఢిల్లీ మీద పడిందని అంటున్నారు.


కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ ఉన్నారు. ఈ ఫ్రంట్ దేశవ్యాప్తంగా మిగిలిన పార్టీలను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇపుడు కొత్త ఆలొచనలు వస్తున్నాయి. సౌత్ ఇండియాలోని రీజనల్ పార్టీలను ఒకే చోట చేరి పెద్ద సంఖ్యలో సీట్లతో ఫ్రంట్ కడితే రేపటి రోజూ ఏ పార్టీ కేంద్రంలఒ వచ్చిన డిమాండ్లు సాధించుకునే వీలు అవుతుందని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఏపీలో జగన్, తెలంగాణాలో కేసీయార్, ఎం ఐ ఎం పార్టీలకు ఫలితాల తరువాత కచ్చితంగా 35 ఎంపీ సీట్లకు పైగానే వస్తాయని అంచనా.


ఒడిషాలోని బిజూ జనతాదళ్ ని కలుపుకుని పోవడంతో పాటు, తమిళనాట స్టాలిన్ తో  కలసి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారుట. ఇక కర్నాటకలో కుమారస్వామికి కూడా తిప్పుకుంటే కనీసం డెబ్బై వరకూ సీట్లతో ఈ సౌతిండియా ఫ్రంట్ రేపటి రోజున కేంద్రంలో కొత్త సర్కార్ ఏర్పాటులో కీలకం అవుతుందని అంటున్నారు. మరి చూడాలి జగన్ ఏ విధంగా పావులు కదుపుతారో, కేసీయార్ రాజకీయ చాణక్యం ఎలా దూసుకువెళ్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: