ఏపీ ఎన్నికలు తెగ టెన్షన్ పెడుతున్నాయి. అటు అధికార పార్టీ అధినేత చంద్రబాబు, ఇటు ప్రతిపక్ష నేత జగన్, మరో వైపు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురూ ఫలితాలపై తెగ పరేషాన్ అవుతున్నారు. సీఎం ఎవరు అన్నది బాబు జగన్ ఇద్దరి మధ్యనే ఉందని అంటున్నా  హంగ్ అవకాశాలు ఇంకా ఉన్నాయన్న ఆశలు పవన్లో కనిపిస్తున్నాయట.


మొత్తానికి ముగ్గురు నేతలు ఈ రోజు అమరావతి చేరుకుంటున్నారు. జగన్ మధ్యాహ్నం విమానంలో పార్టీ నాయకులతో కలసి అమరావతి బయల్దేరారు. మరో వైపు సతీ సమేతంగా కుప్పంలో పూజలు చేసిన చంద్రబాబు బెంగుళూరు మీదుగా అమరావతి చేరుకుంటున్నారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడకు వస్తున్నారు. ఈ ముగ్గురు అధినేతలు నేతలు తమ పార్టీ ఆఫీసుల నుంచి రేపు జరిగే కౌంటింగ్ సరళిని గమనిస్తారని అంటున్నారు. పార్టీ నాయకులకు సూచనలు ఇస్తూ ఎప్పటికపుడు సమాచారాన్ని తెప్పించుకుంటారని తెలుస్తోంది.


ఇక జగన్ విష\యానికి వస్తే తమ పార్టీ గెలిస్తే అభ్యర్ధులతో కలసి ఇడుపులపాయ వెళ్ళి తండ్రి వైఎస్సార్ కి ఘన నివాళి అర్పించేందుకు రెడీ అవుతున్నారు. మరో వైపు టీడీపీ అధినేత కూడా కౌంటింగ్ సరళిని తెలుసుకుని గెలిచే అవకాశాలు ఉంటే అమరావతిలోనే ఉండి మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యేదాక ద్రుష్టి సారిస్తారట. మీడియా సమావేశాలు కూడా ఉంటాయట. అదే పార్టీ ఓడిపోతే మాత్రం మీడియాకు మొక్కుబడిగా  బ్రీఫింగ్ ఇచ్చేసి బాబు గారు ఢిల్లీకి వెళ్ళిపోతారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: